Telangana: లగచర్ల ఫార్మా కంపెనీ విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిన సంగతి మనకు తెలిసిందే. లగచర్ల పరిసర ప్రాంతాలలో ఫార్మ కంపెనీ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణకు వెళ్లినటువంటి అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇలా గ్రామస్తులపై దాడి జరగడంతో ఈ విషయం కాస్త సంచలనగా మారింది. అయితే ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఈ వివాదం కారణంగా అక్కడ ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇలా ఈయన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఒకవిధంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా ఉండటంతో బిఆర్ఎస్ నేతలు ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి లగచర్ల భూసేకరణ విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గి ఆ నోటిఫికేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా లగచర్ల భూసేకరణ రద్దు చేసుకోవడంతో అక్కడి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్ లగచర్లలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ చేయబోతున్నట్లు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. లగచర్ల గ్రామం మాత్రమే కాకుండా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2013 చట్ట సెక్షన్ 6(2) కింద భూసేకరణ నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ విధంగా మరోసారి కొత్త నోటిఫికేషన్ ద్వారా భూ సేకరణ చేపట్టబోతున్నారని తెలియజేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణలో భాగంగా రైతుల నుంచి అలాగే బిఆర్ఎస్ నేతల నుంచి ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుందనేది తెలియాల్సి ఉంది.
