ఇలాంటి నేతల వల్లే వైసీపీ పరువు పోతుందా.. ?

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని అమె చిన్న కూతురు దీక్షిత మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులు ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కానీ వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయని కానీ అనుమానాలను వ్యక్తం చేయడం లేదు. అయితే ఉమా మహేశ్వరి ఆత్మహత్యను సైతం కొంతమంది వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.

ఏపీ అటవీ కార్పొరేషన్ ఛైర్మన్ అయిన గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలలో ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు లోకేశ్ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉమా మహేశ్వరి ఆరు ఎకరాల 73 సెంట్ల భూమి కోసం లోకేశ్ తో గొడవ పడ్డారనే
అర్థం వచ్చే విధంగా దేవేంద్ర రెడ్డి పోస్టుల్లో పేర్కొన్నారు. లోకేష్ పిన్ని అయిన ఉమ్మ మహేశ్వరిని ఇష్టానుసారం బూతులు తిట్టారని ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోస్ట్ ల ద్వారా వెల్లడించారు.

ఉమా మహేశ్వరిది హఠాన్మరణమా? ఆత్మహత్యా? అనుమానాస్పద మృతా? అసలు కారణం ఏంటి? అసలు కారకులు ఎవరు? అంటూ మరో పోస్ట్ లో దేవేంద్ర రెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కూతురుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో పచ్చ మీడియా డిబేట్లు పెట్టాలని ఆయన మరో పోస్ట్ లో పేర్కొన్నారు. అనారోగ్య సమస్యల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆమె మెడపై ఘాట్లు ఎలా వస్తాయని ఆయన మరో పోస్ట్ లో ప్రశ్నించారు.

అయితే ఆయన చెప్పిన సర్వే నంబర్లలో అసలు భూమే లేదని తెలుస్తోంది. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆరోపణలలో ఒక్క ఆరోపణ కూడా నిజం కాదని ప్రూవ్ అయితే వైసీపీ పరువు పోతుందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్నవాళ్లు ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు.