టీడీపీ తరపున రాబోయే రోజుల్లో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుందా లేక జూనియర్ ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందా అనే ప్రశ్నకు ఎక్కువమంది జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెబుతారు. టీడీపీకి తారక్ దూరంగా ఉంటే ఆ పార్టీకే నష్టమే అని చాలామంది భావిస్తున్నారు. అయితే టీడీపీకి తారక్ సపోర్ట్ లేనట్టేనని చంద్రబాబు నాయుడుకు తారక్ దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
తాజాగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ హరికృష్ణ మరణానికి కూడా చంద్రబాబు పరోక్షంగా కారణమని అందువల్ల జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చంద్రబాబుతో మాట్లాడటం లేదని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు సైతం తక్కువగానే ఉన్నాయి. ఫలితంగా తారక్ టీడీపీకి దూరంగా ఉన్నారని ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు సైతం క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం తారక్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తారక్ కు పాన్ ఇండియా గుర్తింపు రావడంతో ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టే ఛాన్స్ లేదు. చంద్రబాబు పూర్తిగా టీడీపీకి దూరమైతే మాత్రమే తారక్ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు రోజుకురోజుకు పార్టీకి దగ్గరయ్యే వాళ్లతో పోలిస్తే దూరమయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
తారక్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ చేసినా ఆ కామెంట్ చంద్రబాబు పొలిటికల్ కెరీర్ పై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు గత కొంతకాలంగ లోకేశ్ తారక్ గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే లోకేశ్ పోస్టుల ద్వారా తారక్ పై అభిమానాన్ని చూపడాన్ని టీడీపీ నేతలు సైతం నమ్మడం లేదు. మరోవైపు ఏపీ రాజకీయాలలో తారక్ చక్రం తిప్పుతారని చాలామంది భావిస్తున్నారు.