తాజాగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను చూసిన తర్వాత అప్పుడెప్పుడో ఎన్టీయార్ ఎంపిక గుర్తుకు వస్తోంది. 1982లో ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేశారు. 1983లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక జరిగింది. అప్పటి ఎంపికలో ఎక్కువమంది విద్యావంతులను, వివిధ రంగాల్లో బాగా పేరున్న వారినే ఎంపిక చేసి టికెట్లు ఇచ్చారు. టిడిపి తరపున మొదటి ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నేతలున్నప్పటికీ న్యాయవాదులు, లెక్చిరర్లు, డాక్టర్లు, వాస్తుశిల్పులుండేవారు.
వైసిపి తరపున పోట చేయబోయే అభ్యర్ధుల జాబితాను చూసిన తర్వాత అప్పటి విషయం గుర్తుకు వస్తోంది. తాజా జాబితాలో కూడా పలువురు డాక్టర్లు, లెక్చిరర్లు, అఖిల భారత సర్వీసులో పని చేసిన ఉన్నతాధికారులున్నారు. అంటే ఇపుడు కూడా రాజకీయ నేతలు ఉన్నారనుకోండి అది వేరే సంగతి. రాజకీయ నేతలు లేకుండా రాజకీయాలు ఉండవు కదా ?
ప్రస్తుత వైసిపి తరపున పోటీ చేయబోతున్న అభ్యర్ధుల్లో వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు 24 మంది ఉన్నారు. అఖిల భారత సర్వీసులో పనిచేసిన ఉన్నతాధికారులు 9 మందు న్నారు. 15 మంది వైద్యులు పోటీ చేస్తున్నారు. 41 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 98 మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేస్తున్నారు. ఇంతమంది విద్యావంతులు, వృత్తినిపుణులు, డాక్టర్లు మరే పార్టీ తరపున కూడా పోటీ చేయటం లేదన్నది వాస్తవం.
టిడిపి తరపున చూస్తే పోటీ చేస్తున్నవారిలో ఎక్కువమంది రాజకీయనేతలు కమ్ కాంట్రాక్టర్లు కమ్ పారిశ్రామికవేత్తలే కనబడుతున్నారు. అందులోను గడచిన ఐదేళ్ళల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలు, ఎంపిలు లేదా నేతలు కావచ్చు అత్యధికులు విపరీతంగా డబ్బులు సంపాదించున్నారు. టిడిపిలోని సెలక్షన్ చూసిన తర్వాత వైసిపి అభ్యర్ధులను చూస్తే ఆర్ధిక వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. 1983లో కూడా టిడిపి అభ్యర్ధులు సీనియర్ కాంగ్రెస్ నేతలతో పోటీ చేసి మట్టికరిపించారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి.
