టీడీపీ, జనసేన.. ఆ రాష్ట్రంలో పుంజుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదా?

ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం కానీ ఈ రెండు పార్టీలకు పరవాలేదనే స్థాయిలో సీట్లు రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీల పరిస్థితి బాగానే ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ పార్టీల పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో అధికారంలోకి రావడానికి తెగ కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ తెలంగాణపై నామమాత్రంగా కూడా దృష్టి పెట్టలేదు. జనసేన పార్టీ భవిష్యత్తులో సైతం తెలంగాణలో పుంజుకునే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో టీడీపీ పరిస్థితి సైతం దారుణంగా ఉంది. ఆ పార్టీ పుంజుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీ పుంజుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదనే చెప్పాలి.

టీడీపీ, జనసేన ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా సత్తా చాటాలని ఈ పార్టీల తెలంగాణ అభిమానులు కోరుకుంటున్నారు. తెలంగాణపై ఈ రెండు పార్టీలు దృష్టి పెడితే నామమాత్రంగానైనా ఈ పార్టీలు సీట్లను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన పుంజుకోవడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి.

టీ,ఆర్.ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఈ మూడు పార్టీలకు సమానంగా అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పుంజుకుంటే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.