హరికృష్ణ ఆరు నెలలే మంత్రి.. పదవి ఎలా కోల్పోయారంటే ?

టిడిపిలో అంత పెద్ద లీడర్ గా ప్రఖ్యాతిగాంచిన హరికృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలు మాత్రమే మంత్రిగా నందమూరి హరికృష్ణ పనిచేశారు.  ముఖ్యమంత్రి కొడుకు అయినప్పటికీ ఆయన వారసత్వ రాజకీయాల కోసం అర్రులు చాచలేదు. ఆరు నెలలు మాత్రమే మంత్రిగా హరికృష్ణ ఎందుకు పనిచేశారు. తర్వాత ఎందుకు మంత్రి పదవిని వదులుకున్నారు? వివరాల కోసం ఫుల్ స్టోరీ చదవండి.

1994 ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 26 సీట్లు మాత్రమే వస్తే మిగిలిన వన్నీ  టీడీపీ సహా మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు గెలుచుకున్నాయి. 1995లో టీడీపీలో నెకొన్న ఆగస్టు  సంక్షోభం తరువాత  నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టారు.

ఈ  సమయంలోనే ఏ పదవిలో లేని నందమూరి హరికృష్ణను చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన రవాణా శాఖను అప్పగించారు. 1996 జనవరి 18న ఎన్‌టీ రామారావు మరణించారు. రాష్ట్ర మంతివ్రర్గంలో ఉన్న వారు ఎవరైనా ఆరు నెల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. హరికృష్ణ మంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో శాసననమండలి లేదు.  శాసనసభ స్థానాు ఏవీ ఖాళీగా లేవు. దీంతో ఆయన చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం కగలేదు.

ఎన్‌టీ రామారావు జనవరిలో మరణించినా ఆ వెంటనే ఆయన ప్రాతినిధ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగలేదు. ఒకవేళ వెంటనే ఉప ఎన్నిక జరిగి ఉంటే హరికృష్ణ  ఆ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి మంత్రిగా కొనసాగేవారు.

అయితే అపుడు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండి చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఒకవేళ  హరికృష్ణ గెలిచి మంత్రిగా కొనసాగితే ఎన్‌టీఆర్‌ హయాంలో తాను ఒక అధికార కేంద్రంగా టీడీపీలో ఎలా తయారయ్యానో హరికృష్ణ  కూడా అలా తయారు అవుతారని, అపుడు తనకు  ఇబ్బందు రాజకీయంగా ఎదురౌతాయని భావించి సకాంలో ఎన్నికు జరగకుండా అడ్డుకున్నారని అప్పట్లో టీడీపీలో ప్రచారం జరిగింది.

హరికృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కొంత గ్యాప్ తర్వాత  ఎన్‌టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికు జరిగాయి. ఈ ఎన్నికల్లో హరికృష్ణ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి క్ష్మీనారాయణ రెడ్డిపై 59 వేకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హరికృష్ణ మంచి మెజారిటీతో గెలిచారు. అప్పుడైనా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉండె. కానీ  కారణాలేమైనప్పటికీ చంద్రబాబు ఆయన్ను మాత్రం తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోలేదు. 

అలా ఆరు నెలలు మాత్రమే తన జీవితంలో మంత్రిగా పనిచేశారు నందమూరి హరికృష్ణ. హరికృష్ణ ట్రాన్స్ పోర్టు శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జర్నలిస్టులకు బస్ పాసులు ఇవ్వాలన్నదానిపై గట్టిగా ఫైట్ చేసి సాధించారని ఇప్పటికీ జర్నలిస్టులు చెప్పుకుంటారు. జర్నలిస్టులకు బస్ పాస్ అనే సదుపాయం కల్పించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అని పలువురు జర్నలిస్టులు నాటి ఘటనలు గుర్తు చేసుకుంటన్నారు.

బహుషా చట్టసభకు సభ్యుడిగా లేకుండా ఆరు నెలలపాటు మంత్రిగా చేసిన వ్యక్తి తెలుగు నేల మీద హరికృష్ణ ఒక్కడే ఉంటాడేమో అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆరు నెలల్లో ఏ చట్టసభకు ఎంపిక కాకుండా మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తి కూడా హరికృష్ణ ఒక్కడే కావొచ్చని కూడా చెబుతున్నారు.