Pawan Kalyan: దయచేసి పవన్ కళ్యాణ్ ను హర్ట్ చెయ్యొద్దు…. హర్ట్ అయితే అంతే సంగతులు?

Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవి చుట్టూ తిరుగుతున్నాయి కూటమిలో భాగంగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇలా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అయితే గత నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు మంత్రులందరూ కూడా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని రాగం వినిపిస్తున్నారు.

లోకేష్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడానికి పూర్తిస్థాయిలో అర్హుడు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తప్పేంటి అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఈ విషయంపై గత నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున నేతలలో చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు పవన్ కాని చంద్రబాబు లేదా లోకేష్ ఎవరు కూడా ఈ విషయం గురించి స్పందించలేదు కానీ నేతలలో మాత్రం చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి.

సోషల్ మీడియా వేదికగా జనసేన తెలుగుదేశం మధ్య వార్ కూడా నడుస్తుంది లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొంతమంది దయచేసి పవన్ కళ్యాణ్ ని ఎవరు రెచ్చగొట్టొద్దు ఆయన రెచ్చిపోయారు అంటే కథ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించడంతో ఆయన బాగా హర్ట్ అవడం , ఇలా హర్ట్ అవడంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేశాడు. అలాంటి వ్యక్తిని రెచ్చగొడితే చిటికెలో కూటమి నుంచి బయటకు వచ్చేస్తారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదని హెచ్చరిస్తున్నారు.

నారా లోకేష్ పాదయాత్ర చేయడం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఎంతో కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని లేకపోతే వైసీపీకి ఇదే సరైన అస్త్రంగా మారుతుంది అంటూ మరికొందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.