Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఆంధ్ర పదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టారనే చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏదైనా సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ వచ్చారు అంటే ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది. ఇలా ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా వేడుకకు వస్తే కనుక ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే అంటూ గతంలో ఈయన అటెండ్ అయిన సినిమాల జాబితాను వైరల్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా అంటే సుందరానికి, రిపబ్లిక్, సైరా నరసింహారెడ్డి, నేల టికెట్, నా పేరు సూర్య, చల్ మోహన్ రంగా వంటి సినిమా వేడుకలకు హాజరయ్యారు అయితే ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వటం గమనార్హం.
ఇలా ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా వేడుకకు వస్తే ఆ సినిమా ఫ్లాప్ అయినట్టేనని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పవన్ ఫాన్స్ స్పందిస్తూ నిజంగానే పవన్ కళ్యాణ్ వస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అంటే గతంలో ఈయన జులాయి, మగధీర, ఇష్క్, నాయక్, అఆ వంటి సినిమా వేడుకలలో పాల్గొన్నారు. ఈ సినిమాలు హిట్ అయ్యాయి కదా అంటూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా వేడుకకు ఎవరు వచ్చినా రాకపోయినా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకాకుండా కంటెంట్ లేకుండా సినిమాలు చేసి ఫలానా వారు రావడంతోనే ఫెయిల్ అయింది అనడం సబబు కాదంటూ పవన్ ఫ్యాన్స్ ఈ వార్తలను తిప్పికొడుతున్నారు.