Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం వార్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం ఒకరే ఉండాలనే నిబంధనను కూడా పవన్ పెట్టడంతో బాబు కూడా ఓకే చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం డిప్యూటీ సీఎం గా లోకేష్ ఉండాలి అంటూ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.
గత మూడు రోజులుగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా ముక్తకంఠంతో మీడియా ముందు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి ఆయన డిప్యూటీ సీఎం అవ్వడానికి పూర్తిస్థాయిలో అర్హులు అంటూ కీలక నేతలు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. దీంతో జనసైనికులు జనసేన నేతలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పార్టీని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ ఏంటి అంటూ కామెంట్లు చేయడమే కాకుండా పవన్ లేకపోతే తెలుగుదేశం పార్టీనే లేదు అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. అయితే ఉన్నఫలంగా ఇలా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే వాదన తెరపైకి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై జనసైనికులు చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలా చేస్తున్నారని ఈ డిమాండ్లు వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో అంచలంచలుగా ఎదుగుతూ ఆయన జాతీయస్థాయిలో నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. ఇక కేంద్ర పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలాంటి వ్యూహం బాబు రచిస్తున్నారని భావిస్తున్నారు.
రాజకీయాలలో పవన్ ఉన్నత స్థాయికి చేరుకుంటే తన కొడుకు లోకేష్ రాజకీయ ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందని భావించిన చంద్రబాబు తెర వెనక ఉండి తెలుగుదేశం నేతలతో ఇలాంటి కథ నడిపిస్తున్నారంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం కాస్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.