Pawan Kalyan: పవన్ కోసం కదం తొక్కిన కాపులు… పవన్ సీఎం కావాల్సిందే?

Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో గొడవలు మొదలయ్యాయా అంటే అవునని తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఎనిమిది నెలల అవుతున్న ఎనిమిది నెలల కాలంలోనే కూటమిలో చీలికలు రాబోతున్నాయని స్పష్టం అవుతుంది. ప్రస్తుతం కూటమి పార్టీలో బేదాభిప్రాయాలు రావడంతో కాపులంతా పవన్ కోసం కదం తొక్కుతున్నారు.

గత నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు వారి అనుకూల మీడియా ఛానళ్లలో లోకేష్ కు మద్దతుగా నిలిచారు. నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడానికి పూర్తిస్థాయిలో అర్హుడని ఆయనకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తే తప్పేంటి అంటూ మాట్లాడుతున్నారు. ఇక పిఠాపురం మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే వర్మ సైతం లోకేష్ కు డిప్యూటీ ఇస్తే తప్పేముంది అంటూ మాట్లాడారు.

ఇలా గత మూడు రోజులుగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ తెలుగుదేశం నేతలు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్న నేపథ్యంలో జనసైనికులు కాపులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉన్నఫలంగా తెలుగుదేశం నేతలందరూ కూడా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ మీడియా ముందుకు రావడం వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు.

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు సొంతం. అప్పట్లో వాజ్ పేయ్, ఆ తర్వాత నరేంద్ర మోడీలను వాడుకోని వారినే బద్నాం చేసిన చరిత్ర చంద్రబాబు అంటూ ఏకి పారేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది ఇక ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ముఖ్యమంత్రి స్థానాన్ని పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూటమిలో గత నాలుగు రోజులుగా డిప్యూటీ సీఎం వార్ నడుస్తుందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఈ విషయం పై చంద్రబాబు కానీ ఇటు పవన్ కాని లోకేష్ ఎవరు కూడా స్పందించలేదు.