Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలలో అలగే సినిమాలలోనూ కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు అద్భుతమైన విజయాన్ని సాధించి రాజకీయాల పరంగా కూడా సక్సెస్ అయ్యారు.
ఇకపోతే బాలకృష్ణ తాజాగా డాకూ మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో యాంకర్ సుమతో కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బాలకృష్ణ ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతారు అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తనకు ఆదివారం అంటే కాస్త భయమని ఆదివారం పొరపాటున కూడా తాను నలుపు రంగు దుస్తులు ధరించనని బాలకృష్ణ తెలిపారు. తనది మూలా నక్షత్రం, ఆదివారం ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను అందుకే ఆదివారం పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు తాను ధరించనని తెలిపారు. పొరపాటున ఆదివారం నలుపు రంగు దుస్తులు ధరించాను అంటే ఏదో ఒక చెడు జరుగుతుందని తెలిపారు.
ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో దర్శకులకు నేను ముందుగానే చెప్పాను. ఆదివారం నలుపు రంగు దుస్తులు ధరించను అని కానీ ఆ రోజు కచ్చితంగా ధరించాల్సిన అవసరం రావడంతో దర్శకులు చెప్పిన ప్రకారమే తాను ఆ రోజు నలుపు దుస్తులు వేసుకున్నాను అయితే ఆరోజు రాకరాక బాలసుబ్రమణ్యం గారు సినిమా షూటింగ్ లొకేషన్లోకి వచ్చారు అయితే ఆయన చూస్తుండగానే నేను జారి కింద పడ్డానని ఆ సమయంలో నాకు నడుము విరిగిందని తెలిపారు.
అందరూ కూడా బాలసుబ్రమణ్యం రావడం వల్ల అలా జరిగిందని భావించారు. కానీ నేను మాత్రం ఆ రోజు ఆదివారం నలుపు దుస్తులు వేసుకోవటం వల్లే అలా జరిగిందని భావిస్తాను. ఇక ఈ ఘటన తర్వాత బాలసుబ్రమణ్యం కూడా కాస్త కంగారు పడ్డారని ఇక తాను పొరపాటున కూడా సినిమా షూటింగ్ సెట్ లోకి రాలేదని బాలకృష్ణ తెలిపారు. అందుకే తాను పొరపాటున కూడా ఆదివారం నలుపు రంగు దుస్తులు ఇప్పటికీ ధరించనని తెలియజేశారు.