Ambanti: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఏపీలో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఏపీలో పర్యటించిన నేపథ్యంలో వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబంటి రాంబాబు మాట్లాడుతూ అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నాయుడుకు బాగా తెలిసిన విద్య అని తెలిపారు.
గతంలో అమిత్ షా తిరుపతికి వస్తున్న నేపథ్యంలో అమిత్ షాపై రాళ్ల వర్షం కురిపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. ప్రస్తుతం మాత్రం ఆయనకు స్వాగతం పలుకుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీలో భాగంగా ఎన్నో విషయాలు చర్చలకు వచ్చాయి. ఏపీలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, తెలంగాణ నుంచి రావాల్సిన 8 వేల కోట్ల బకాయిలు, కృష్ణా జలాల సమస్యలు ఉన్నాయని, అమిత్ షా వీటి గురించి ఎందుకు చర్చించలేదని తెలిపారు.
ఇక ఈ భేటీలో భాగంగా అమిత్ షా జగన్ గురించి జగన్ ప్యాలెస్ ల గురించి అడిగారని చెబుతున్నారు అయితే ఆయన ఉన్న చంద్రబాబు ఇళ్లు ఓ అక్రమ కట్టడం అని, దాని గురించి అమిత్ షాకు చెప్పాల్సింది కదా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా చెప్పడ వల్లే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ కు ఇస్తామంటే అమిత్ షా ఒప్పుకోలేదనే సమాచారం మావద్ద ఉందని తెలిపారు.
ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్, మానవ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుందని అమిత్ షా అంటున్నారని, మరి తిరుపతి ఎందుకు రాలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేతకాని పాలన నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు అర్థం లేని మాటలతో అందరి బుర్రలు పాడు చేస్తున్నారు అంటూ అంబంటి రాంబాబు చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు