Balakrishna: గోరంతను కొండంత చూపించే సంస్కారం నాది కాదు…. మెగా హీరోకి బాలయ్య కౌంటర్ ?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. అఖండ సినిమా సమయం నుంచి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అఖండమైన విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే చాలామంది హీరోలు తమ సినిమా మొదటి రోజు కలెక్షన్లకు సంబంధించి పోస్టర్లను విడుదల చేస్తూ ఉంటారు అయితే చాలా వరకు అందులో నిజం ఉండదని ఫేక్ పోస్టర్లతో తమ సినిమాకి హైప్ తీసుకువస్తూ ఉంటారు.

ఇలా ఫేక్ పోస్టర్లు ప్రకటించే వారి గురించి ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తొలి నుంచి నా సినిమాల రికార్డులు, రివార్డులు, నా అవార్డులు జెన్యూన్‌గా ఉంటాయని.. గోరంతను కొండంతగా చూపించే సంస్కారం నాకు లేదని తెలిపారు. నేను సాధించిన రికార్డులు రివార్డులు అన్ని అన్ స్టాపబుల్. తాను సినిమా షూటింగ్లో ఉంటే ప్రొడక్షన్ వారు పెట్టే ఫుడ్డు తింటాను నా ఇంటి పక్కన షూటింగ్ జరిగిన నేను అక్కడే భోజనం చేస్తానని, అందరితో కలిసి పోవడమే నాకిష్టం అంటూ బాలయ్య తెలిపారు అయితే ఈయన ఫేక్ పోస్టర్స్ అంటూ మాట్లాడటంతో కచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పోస్టర్ ను ఉద్దేశించే మాట్లాడాలని పలువురు భావిస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు 186 కోట్ల కలెక్షన్స్ రాబడినట్లు పోస్టర్ విడుదల చేయడంతో భారీగా విమర్శలను ఎదుర్కొంది అయితే ఈ పోస్టర్స్ ను ఉద్దేశించి బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.