Home Andhra Pradesh ఏపీ బీజేపీ లీడర్ పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నారు... తెరవెనుక ఏం జరుగుతుంది ?

ఏపీ బీజేపీ లీడర్ పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నారు… తెరవెనుక ఏం జరుగుతుంది ?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం అవుతుందని, అందరూ వచ్చి పార్టీలో చేరతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని, అధికార పార్టీ పెడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బీజేపీలో చేరడమే బెటర్ అని అనేక మంది నేతలు నిన్న మొన్నటి వరకూ భావించారు. జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలే బీజేపీ గూటికి చేరతారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ జరగడం లేదు.

There Is No New Joinings In Ap Bjp Party Since Somu Veerraju Elected As President
BJP president Somu veerraju

బీజేపీలో గత కొద్ది నెలలుగా చేరికలు లేకుండా పోయాయి. ప్రధానంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత బీజేపీలో కండువాలు కప్పే కార్యక్రమే కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం పార్టీలో చోటు చేసుకుంటున్న సంఘటనలే కారణమంటున్నారు. వరసగా పార్టీ నేతలపై సస్పెన్షన్లను వేస్తుండటం, బీజేపీ నేతలపై ఆంక్షలు పెట్టడంతోనే చేరికలకు ఫుల్ స్టాప్ పడిందంటున్నారు.నిజానికి బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో చేరికలు పెరుగుతాయని భావించారు. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి తప్పించుకోవడానికైనా బీజేపీలో చేరాలని కొందరు టీడీపీ నేతలు భావించారు. ఈ మేరకు మానసికంగా సిద్దమయ్యారు కూడా. జనసేన, బీజేపీ పొత్తు తమకు కలసి వస్తుందని వారు సిద్దమయిన సమయంలో బీజేపీ పగ్గాలు సోము వీర్రాజు చేపట్టారు. ఇది పార్టీ మారాలనుకున్న నేతలకు రుచించలేదు.

దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది. చంద్రబాబు పార్టీ పదవులను కూడా భర్తీ చేశారు. దీంతో బీజేపీలో ఇక చేరికలు ఉండే అవకాశం లేదంటున్నారు. చంద్రబాబు బీజేపీతో సఖ్యతకు ప్రయత్నిస్తుండటం కూడా చేరికలు లేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. మరికొద్దిరోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుందని పార్టీని వీడాలనుకుంటున్న టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో కమలం పార్టీలో గత కొద్ది నెలలుగా చేరికలు లేక వెలవెలపోతుంది. భవిష్యత్ లోనూ ఆ పార్టీలో చేరికలు కష్టమేనంటున్నారు.

- Advertisement -

Related Posts

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సంపూర్ణేష్‌.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం

ఒక‌ప్పుడు డూపుల‌తో స్టంట్స్ చేసే మ‌న హీరోలు ఇప్పుడు ఎవ‌రి సాయం అవ‌సరం లేద‌న్న‌ట్టు యాక్ష‌న్ సీన్స్‌లోకి బ‌రిలోకి దిగుతున్నారు. ఇటీవ‌ల అజిత్ ఓ యాక్ష‌న్ సీన్ లో భాగంగా పెద్ద ప్ర‌మాదం...

నిమ్మగడ్డ తమకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు అని ఆనందించేలోపు చంద్రబాబు కి షాక్ !

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం జెడ్పీటీసీ...

వైసీపీలో సింగిల్ హ్యాండ్ కమ్మ నేత.. డైరెక్ట్ జగన్‌తోనే 

రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం రాజకీయాలను ప్రభావితం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది.  ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో కమ్మ నేతలు రాజకీయాల్లో ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉన్నారు.  ఈ సామాజికవర్గం ప్రధానంగా  తెలుగుదేశం పార్టీలో పెత్తనం చేస్తూ వచ్చారు.  గతంలో...

Latest News