ఆ విషయంలో మారిపోయిన పవన్ కళ్యాణ్.. టీడీపీ, వైసీపీలకు షాకేనా?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి కారణాలేంటనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు సమాధానంగా వినిపిస్తాయి. ప్రధానంగా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పార్టీల నేతల స్థాయిలో డబ్బులు ఖర్చు చేయలేదనే విషయం తెలిసిందే. ఓటర్లకు డబ్బు పంచకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే అభ్యర్థి కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా ఖర్చు చేయకపోవడం పార్టీకి మైనస్ అవుతోంది.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయాలని పవన్ తాజాగా జనసేన నేతలతో చెప్పారని బోగట్టా. ఓట్లు కొనకూడని రాజకీయం మాత్రమే చేయాలని తాను చెప్పానని ఆయన అన్నారు. జీరో బడ్జెట్ రాజకీయం చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పెద్దపెద్ద నాయకులు పోటీ చేసినా డబ్బులు ఖర్చు చేయలేదని పవన్ తెలిపారు.

ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులకు ధీటుగా ఖర్చు చేయాలని పవన్ పిలుపునివ్వడంతో టీడీపీ, వైసీపీలకు షాక్ తప్పదని తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తుండటం గమనార్హం. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినా ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఘోర పరాజయానికి కారణాలను విశ్లేషించుకుని పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇస్తారా? లేక ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అవుతారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టని పార్టీగా ముద్ర వేయించుకున్న జనసేన ఇకపై ఖర్చు విషయంలో వెనక్కు తగ్గకూడదని భావిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు మరో 18 నెలల సమయం మాత్రమే ఉండగా పవన్ కళ్యాణ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.