పవన్ కళ్యాణ్ కాలుకు ఏమైందబ్బా ? (ఫొటో గ్యాలరీ)

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ జిల్లాలో జనసేన పోరాట యాత్రలో పవన్ పాల్గొన్న సందర్భంలో పవన్ కాలు బెనికింది. దీంతో కొంత ఇబ్బంది పడ్డారు పవన్. భీమవరంలోని ఎన్ డి. ఫంక్షన్ హాలులో పవన్ బస చేశారు. ఆయన రాకతో పవన్ ను కలిసేందుకు అభిమానులు పోటెత్తారు. బయటకు వచ్చి వారితో మాట్లాడి లోపలికి వస్తున్న సందర్భంలో నేల తడిగా ఉండడంతో ఆయన కాలు స్కిడ్ అయింది. దీంతో కుడి కాలు బెనికింది. వెంటనే బ్యాండేజి వేశారు. డాక్టర్లు వచ్చి పరీక్షించారు. పెయిన్ కిల్లర్ వాడాలని సూచించారు. కాలుకు క్యాప్ వేశారు. స్వల్ప విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

పవన్ కళ్యాణ్ కాలు బెనకడంతో ఇబ్బంది పడ్డారు. అయితే ఆ ఫొటోలు మీడియాకు విడుదలయ్యాయి. ఫొటో గ్యాలరీ కింద ఉంది చూడండి.