నాదెండ్ల మనోహర్ గురించి ఒక రహస్యచెప్పిన పవన్

విజయవాడ :  జనసేన లో చేరిన ఆంధ్రప్రదేశ్ మాజీ  నాదెండ్ల మనోహర్ కొద్ది సేపటి కిందట జనసేన అధినేత  పవన్ కల్యాణ్   ఇంటికి చేరుకున్నారు. అక్కడ నాదెండ్ల మనోహర్ను పవన్ పార్టీ నేతలకు పరిచయం చేశారు.

అపుడు పవన్ కల్యాణ్ అన్నమాటలు:

జనసేనకు, నాకూ నాదెండ్ల మనోహర్ అన్న లాంటి వాడు అంటూ మనోహర్ గురించి ఆయన ఒక విషయం చెప్పారు. కేంద్రానికి జనసేన మద్దతు ఉప సహరించుకోవాలన్న తన  నిర్ణయం వెనక వున్న వ్యక్తి నాదెండ్ల మనోహరే నని పవన్ చెప్పారు.

”నాదెండ్ల మనోహర్  తో నాకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. బలమైన ఆలోచన,లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ నా ఆలోచన వెనక ఉన్న వ్యక్తి ఎవరనుకుంటున్నారు, అది  నాదెండ్ల మనోహరే అని పవన్ కల్యాణ్ అన్నారు.

రోజుకో పార్టీ మారే  వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు నాదెండ్ల.

పార్టీని ముందుకి తీసుకెళ్లే వారిలో ఆయన ఒకరు.

పలుమార్లు పార్టీలోకి రావాలని కోరాను, అప్పట్లో రాలేను అన్నారు.  మీరు ఇష్టం వచ్చినపుడు రావచ్చ అని  ఆయన్ని కోరాను

మనోహర్ స్పందన

పవన్ చేసిన పరిచయానికి మనోహర్ స్పందించారు. మనోహర్ చెప్పిన విషయాలివి:

ఇకపై జనసైనికుడిగా పని చేస్తా, పవన్ ఆలోచన, సమాజానికి సేవ చేయాలనే తపన నాకు ఇష్టం.

రాజకీయ మార్పులు ప్రిడిక్ట్ చేయలేం. విలువలు లేకుండా రాజకీయాలు చేయకూడదు, స్వార్ధ రాజకీయలు సరికాదు.

అనుకూల రాజకీయాలు ఎక్కువయ్యాయి, ఒకే నాయకుడు రోజుకు నాలుగు విధాలుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.

విలువైన రాజకీయాలు ముందుకు తీసుకువెళ్లాలి. పవన్ వెనుక జనం వస్తున్నారు కాబట్టి పని అయిపోయిందని అనుకోవటం సరికాదు.సామాన్యులకు ఎలా అండగా ఉంటామనేది మనం చేయాలి. ఎన్నికలకు మనం సిద్ధం గా ఉందాం, నేను 12 ఎన్నికలు చూశాను. పార్టీ మార్పు పై చాలా మంది ఫోన్స్ చేశారు, మీకు పవన్ గురించి ఏం తెలుసు అని అడిగా. పవన్ కు , నాకు ఇద్దరికి అన్న చిరంజీవి.