జగన్ ను కాపీ కొడుతున్న పవన్ కళ్యాణ్.. మూడో నాయకుడు లేడంటూ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి జగన్ ను ఫాలో అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటే జగన్ ను కాపీ కొడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడం వెనుక జగన్ కష్టం ఎంతో ఉంది. జగన్ పై నమ్మకం ఉండటం వల్లే జగన్ కు ప్రజలు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఇచ్చారు.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఎప్పుడు సినిమాలతో బిజీ అవుతారో ఎప్పుడు రాజకీయాలకు సమయం కేటాయిస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప ప్రజలకు పరిచయం ఉన్న మరో వ్యక్తి లేరనే సంగతి తెలిసిందే. 2019లో పవన్ పార్టీకి కేవలం 7 శాతం ఓట్లు వచ్చాయి. రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు.

ఆ అభ్యర్థి సైతం రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ప్రజలు వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. వైసీపీ తన మ్యానిఫెస్టోతో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం వల్ల ఏపీలో అధికారంలోకి రావడం సాధ్యమైంది. జనసేన అధికారంలోకి వచ్చినా పార్టీని నడపడం పవన్ కు సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

జగన్ ను కాపీ కొట్టాలని ప్రయత్నిస్తే పవన్ కు షాకులు తగులుతాయే తప్ప పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏ స్థాయిలో కష్టపడిందో పవన్ గుర్తించి అదే స్థాయిలో శ్రమిస్తే మాత్రమే పవన్ కళ్యాణ్ కు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ఎప్పటికి గ్రహిస్తారో చూడాల్సి ఉంది.