నెల్లూరులో రొట్టెలు పంచనున్న పవన్ కల్యాణ్

ఈనెల 23న నెల్లూరులో  ఈ రోజు నుంచి అయిదు రోజుల పాటు జరిగే  ప్రఖ్యాత రొట్టెలపండుగకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.  శనివారం సాయంత్రం ఆయన నటుడు అలీతో కలసి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడి శేషారెడ్డి స్మారక భవనంలో బస చేస్తారు. తర్వాత 23న పొద్దనే  రోడ్డు మార్గాన నేరుగా నెల్లూరుకు వెళ్తారు నెల్లూరులోని బారా షాహిద్ దర్గాను సందర్శించి అక్కడి స్వర్ణాల చెరువులో రొట్టెను వదలుతారు. 

ఈ పండగ చాలా విచిత్రమయింది.  అంతకంటే విచిత్రం ఇక్కడి రొట్టెలు పేర్లు మారుతూ ఉండటం. సాధారణంగా ప్రజలు కుల మతాలతకు అతీతంగా లక్షల సంఖ్యలో ఈ పండగలో పాల్గొన్ని తమ కోర్కెలు తీరాలని అక్కడ రొట్టెలు కొని పరస్పరం ఇచ్చిపుచ్చకుంటారు. పూర్వం కోర్కెలు సింపుల్ గా ఉండేవి. ఇపుడు  కోర్కెలు చాలా సంక్లిష్టమయ్యాయి. దానికి తగ్గట్టు గా రొట్టెలు కూడా మారాయి. కోర్కెలను బట్టి రొట్టెకు పెర్లొస్తాయి. అక్కపుడు పెళ్లికోసం, రోగాలు నయంకావాలని రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే వారు. ఇపుడు ధన భాగ్యం రొట్టె, వీసా రొట్టె, ఎమ్మెల్యే రొట్టె, ఎంపి రొట్టె, ప్రమోషన్ రొట్టె, కొత్త ఇల్లు రొట్టె …ఇలా రొెట్టెలు  పుట్టుకొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ పండగను రాష్ట్ర పర్వదినంగా ప్రకటించడంతో ప్రాశస్త్యం పెరిగింది. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది దాకా  ప్రజలు రొట్టెల పండగలో పాల్టొంటారని అంచనా.

 ఈ సారి కొత్తగా పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోట ీచేసి, గెలుపొందాలనుకుంటున్న జనసేన అధినేత కూడా రొట్టెలు పంచనున్నారు. అది ఈ ఏడాది విశేషం. ఎన్నికల ముందు వచ్చే పండగ కాబట్టి రాజకీయాల్లో భవిష్యత్తు పరీక్షించుకోవాలనుకునే వారంతా దర్గాను సందర్శిస్తున్నారు.