Home Andhra Pradesh మంత్రివర్గానికి ముహూర్తం కుదిరింది

మంత్రివర్గానికి ముహూర్తం కుదిరింది

మంత్రివర్గం ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి ముహూర్తం నిర్ణయించారు. ఈనెల 8వ తేదీన ఉదయం 7 గంటల ప్రాంతంలో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత 8.39 గంటలకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారిగా సచివాలయంలోని తన చాంబర్లోకి అడుగుపెడతారు. వెంటనే అంటే 11.49 గంటలకు తొలి క్యాబినెట్ భేటీ జరపాలని కూడా నిర్ణయించుకున్నారు.

మొత్తం మీద జగన్ డ్రీమ్ టీమ్  రెడీ అవుతోంది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయమై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా శాఖల వారీగా సమీక్షలు కూడా మొదలుపెట్టేశారు. జగన్ కాకుండా మంత్రివర్గంలోకి 24 మందిని తీసుకోవచ్చు. అందులో పాదయాత్ర సందర్భంగా నలుగురికి బహిరంగంగానే మంత్రిపదవులను హామీ ఇచ్చారు. కాబట్టి ఎంపిక చేసుకోవాల్సింది ఇక  20 మంది మాత్రమే. మర్రి రాజశేఖర్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ముందే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏ సిఎం అయినా అన్నీ స్ధానాలను ఒకేసారి భర్తీ చేయరు. కాబట్టి ఓ నాలుగు స్ధానాలను ఖాళీగా అట్టేపెట్టడతారని అనుకున్నా భర్తీ చేయబోయేది 20 మందినే. అంటే ముందుగానే ప్రకటించిన నలుగురు పోను తీసుకోబోయే మంత్రుల సంఖ్య 16 మాత్రమే. ఆ 16 మంత్రుల విషయంపైనే పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. ఎందుకంటే, ఉన్న ఖాళీలు తక్కువ. గెలిచిన వారి సంఖ్య చాలా ఎక్కువ. అందులోను పదేళ్ళుగా జగన్ నే అంటిపెట్టుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. జగన్ కు ఇపుడిదే పెద్ద సమస్యగా మారింది.

మొత్తానికి మొదటిసారి గెలిచిన వారు, సామాజికవర్గాలు, సీనియర్ శాసనసభ్యులు, ముందునుండి వైసిపిలోనే ఉంటున్న వారు…ఇలా అనేక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నది జగన్ కు పెద్ద విషయం కాదు. అయితే మిగిలిన వారిని సముదయించటమే జగన్ కు పెద్ద సమస్య. ఆ విషయాన్ని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

 

 

 

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News