ఆంధ్ర ప్రదేశ్:జగన్ అధికారంలోకి వచ్చి సంవత్సరంనర దాటిపోయింది…ప్రజలు జగన్ అధికారాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు… సక్రమంగా సంక్షేమ పథకాలు పొందుతూ గతంలో ఎప్పుడు లేనంతగా సంతోషంగా ఉంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని చూసి ఓర్వలేకపోతున్నాడు.జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపి తాము ఎక్కుదామా అని ఎదురుచూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడకుండా కాలమంతా వృథా చేస్తున్నారు. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు అది కూడా వారి ఉనికిని కాపాడుకోవటానికి చేసింది.
ఇన్ని ఇబ్బందులు పెడుతున్న జగన్ మొక్కవోని సంకల్పంతో ముందుకెళుతున్నాడు. ఇక ఇటీవలే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సంబరాలు సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. సోమవారం ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలు, విదేశాలలోనూ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఇదంతా ఒక ఎత్తయితే తిరుపతిలో జన్మదినం జాతరను తలపించింది. వేలాది మంది జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలోని 50 డివిజన్ల నుంచీ జనం తరలివచ్చారు. ఇది చూసి రాష్ట్రంలో నాయకులే కాకుండా దేశంలోని నాయకులూ షాక్ అయ్యారట..ఈ ర్యాలీ దృశ్యాలు, ఆ జన సందోహాంకు వారి గుండెలదిరాయి. త్వరలో తిరుపతి పార్లమెంట్ లోక్‌సభ ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో జగన్ బర్త్ డే వేడుకలు భారీ స్థాయిలో జరగడం చర్చనీయాంశంగా మారింది.