శోభనం గది నుంచి మధ్యలోనే బయటకొచ్చిన కెసిఆర్… నారాయణ జోక్

ముఖ్యమంత్రి కెసిఆర్  అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికల కు పోవడం మీద సిపిఐ నారాయణ ఒక మంచి కథ చెప్పాడు.

కెసియార్ కు పెళ్లి చేసి శోభనం గదిలోకి  పంపించారు.

ఆయనేమో అర్థరాత్రి బయటకొచ్చేశాడు.

వచ్చి ఏమంటున్నాడు, మరొక పెళ్లి చేయంటున్నాడు. ఇదెలా సాధ్యం ఆయన ఢిల్లీలో ప్రశ్నించారు.

 

ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని కూడా తానే చేసి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. ఈ రోజు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో కలసి ఆయన ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ ను కలిశారు.  ఈ మేరకుఒక వినతి పత్రం సమర్పించారు.

అసెంబ్లీరద్దు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ  తానుఎన్నికల కమిషనర్ తో మాట్లాడినట్లు అబద్దం చెప్పారని నారాయణ అన్నారు.

తాను ఎన్నికల కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడానని,  ఆ సంభాషణ ప్రకారం, సెప్టంబర్ లో నోటిఫికేసన్ వెలువడుతుంది,నవంబర్ లో ఎన్నికలుంటాయ, డిసెంబర్ ఫలితాలొస్తాయని చెప్పారు. ఇదే లా చెబుతారు, అని ఆయన అన్నారు.

కెసియార్ ఎన్నికల ప్రధాన కమిషనర్ తో మాట్లాడటం అబద్దం అని నారాయణ చెప్పారు.

ఎన్నికల కమిషన్ ను కూడా కెసిఆర్ అవమానపర్చారని, ప్రధాని పంచన తానున్నాను, తనకు అడ్డు లేదని కెసిఆర్ భావిస్తున్నారని, ఏమి చేసినా చెల్లుతుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రజలు ఆయన కు బుద్ధి చెబుతారని అన్నారు.