2024 ఎన్నికల్లో గెలవడానికి జగన్ మాస్టర్ ప్లాన్.. టీడీపీకి భారీ నష్టమే?

2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలలో చాలామంది పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి పేరును తాము వినకపోయినా వైసీపీ తరపున పోటీ చేశారనే ఒకే ఒక్క కారణంతో గెలిపించడం గమనార్హం. వేర్వేరు కారణాల వల్ల వైసీపీ 2019 ఎన్నికల్లో కొత్త అభ్యర్థులకు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చింది. ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలలో 75 శాతం మంది ఎమ్మెల్యేలు ప్రజలకు మంచి జరిగేలా నడుచుకుంటున్నారు.

25 శాతం మంచి ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు సరైన పాలన అందించడంలో ఫెయిలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గెలవడానికి సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల టీడీపీకి భారీ నష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే జగన్ ఇందుకు సంబంధించిన సమాచారం ఇచ్చారని బోగట్టా.

అయితే 2024 ఎన్నికల్లో గెలవడంతో పాటు టీడీపీకి మరిన్ని సీట్లు తగ్గడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న ఇతర పార్టీల నేతల జాబితా జగన్ దగ్గర ఉందని బోగట్టా. వీళ్లకు వైసీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ ఇవ్వడంతో పాటు ఎన్నికల ఖర్చును నేనే భరిస్తానని జగన్ హామీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇతర పార్టీల నేతలు సైతం జగన్ ఆఫర్ విషయంలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

సీనియర్ టీడీపీ నేతలను ముఖ్యంగా జగన్ టార్గెట్ చేశారని బోగట్టా. గత కొన్నేళ్లలో ఎన్నికల ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ నేతలు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీ ద్వారా ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా విజయం సాధించేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.