కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన స్కీమ్ కూడా ఒకటి. అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయిన రైతులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా గుర్తించిన పంటలు, గుర్తించిన ప్రాంతాల వారికి తప్పనిసరిగా పంట రుణాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రబీ, ఖరీఫ్, ఉద్యాన పంటలకు 1%, 2%, 5% చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి సంబంధించి ఎలాంటి సీలింగ్ ఉండదు. వరదల తాకిడి, తుఫాన్, అగ్ని ప్రమాదాల వల్ల నష్టం వచ్చినా పంటల కోత అయిపోయిన తర్వాత నష్టం సంభవించినా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా పరిహారం లభించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. గతంలో అమలైన పథకాలలోని లోటుపాట్లను గమనించి ఈ స్కీమ్ ను అమలు చేయడం జరుగుతోంది.
ఈ విధానంలో ఒకే తరహా సమస్యలు ఉన్న జిల్లాలను గుర్తించి వారిని ఇన్సూరెన్స్ కంపెనీతో జత చేయడం జరుగుతుందని తెలుస్తోంది. రైతులకు ఈ స్కీమ్ ద్వారా ఎంతగానో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో రిమోట్ సెన్సింగ్ సహాయంతో స్మార్ట్ ఫోన్లు, డ్రోన్ల ద్వారా నష్ట పరిహారాన్ని అంచనా వేస్తారు. రైతులు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ప్రయోజనాలను పొందితే బాగుంటుంది.
రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్ వల్ల ఎంతో లాభం కలుగుతోంది. అయితే ఈ స్కీమ్స్ గురించి షరతుల గురించి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.