మనలో చాలామంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఏదో ఒక విధంగా బెనిఫిట్ పొంది ఉంటారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తోంది. ఈ స్కీమ్ ఎంతో పాపులర్ అయిందనే సంగతి తెలిసిందే. అయితే ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఒకరు కంటే ఎక్కువమంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉండదు.
ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. అయితే ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు. తండ్రీకొడుకులు ఉండి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందాలంటే వాళ్లు వేర్వేరుగా నివాసం ఉండాలి. ఈ విధంగా నివాసం ఉన్నవాళ్లు స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను సులభంగా పొందే ఛాన్స్ ఉంటుంది.
తండ్రీ కొడుకులు పీఎం కిసాన్ బెనిఫిట్స్ ను పొందాలని భావిస్తే మాత్రం పొలం వేర్వేరుగా ఉండాలి. ఒకే పొలం ఇద్దరి పేర్లపై ఉంటే మాత్రం ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సమీపంలోని అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. పీఎం కిసాన్ స్కీమ్ కు అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వాళ్లు దరఖాస్తు చేసుకుంటే మంచిది. పీఎం కిసాన్ స్కీమ్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలవుతూ ఉండటం గమనార్హం.