కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. గొర్రెలు, మేకల పెంపకానికి రూ.కోటి లోన్ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం గొర్రెలు, మేకలు పెంచేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా రూ.కోటి లోన్ ఇవ్వడానికి సిద్ధమైంది. జాతీయ పశు సంవర్ధక కార్యక్రమం ద్వారా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ వల్ల ప్రజలకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

ఒక వ్యక్తి లేదా కొంతమంది గ్రూప్ గా ఏర్పడి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ స్కీమ్ లో కోటి రూపాయలు పొందే ఛాన్స్ ఉండగా 50 లక్షల రూపాయలకు మాత్రం రాయితీ ఉంటుంది. రుణంగా ఇచ్చే రూ.50 లక్షల్లో రూ.40 లక్షలను బ్యాంకులు ఇవ్వనుండగా లబ్ధిదారులు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందిన వాళ్లు 500 ఆడమేకలు లేదా గొర్రెలు, 25 పోతులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సొంత స్థలం లేదా లీజుకు తీసుకునే ఎకరం నుంచి 5 ఎకరాల స్థలం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ద్వారా సులువుగా ప్రయోజనాలను పొందవచ్చు. www.nlm.udyamimitra.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

షెడ్డు నిర్మాణ వివరాలు, పశు వైద్యాధికారి ధృవీకరణ సర్టిఫికెట్ తో పాటు గ్రాసం పెంచే చోటు ఇతర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పశు సంవర్ధక శాఖ అధికారులు అన్ని వివరాలను పరిశీలించి లోన్ ను మంజూరు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.