ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు స్మార్ట్ ఫోన్ పాడవుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు నీళ్లలో పడటం వల్ల అవి పని చేయవు. అలాగే స్మార్ట్ ఫోన్లు కూడా కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే నీటిలో పడిపోతాయి. నీటిలో పడిన వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఫోన్ పనిచేయదు. అయితే నీటిలో పడిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ యధావిధిగా పని చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
• పొరపాటున ఫోన్ నీటిలో పడినప్పుడు అందరూ మొట్టమొదటిగా చేసే పని ఫోన్ తుడిచిన వెంటనే ఫోన్ ఆన్ చేస్తారు. అయితే పొరపాటున కూడా ఇలా ఫోన్ ఆన్ చేయకూడదు. అంతేకాకుండా ఫోన్ అటూ ఇటూ షేక్ చేయకూడదు.
• అలాగే మరికొంతమంది నీటిలో పడిపోయిన ఫోన్ బయటికి తీసిన వెంటనే గాలి ఊపుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీరు ఫోన్ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
• అలాగే పొరపాటున కూడా ఫోన్ మీద ఉన్న తేమని ఆర్పటానికి హెయిర్ డ్రైయర్ వంటి వాటిని అస్సలు ఉపయోగించరాదు.
• ఫోన్ మీద తేమ పూర్తిగా ఆరిపోయిన కొద్ది సేపటి తర్వాత ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌లను బ్యాటరీని ఫోన్ నుంచి తొలగించాలి. అలాగే ఒక మెత్తటి క్లాత్ తో ఫోన్‌లోని తడి ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయలి. తడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వాక్యుమ్‌ను ఉపయోగించి డివైస్‌ను డ్రై చేయాలి.
• ఫోన్ తడి ఆరిపోయిన తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో ఫోన్‌ను రెండు రోజుల పాటు కప్పి ఉంచాలి. ఇలా గాలికూడా చొరబడలేని బిగుతైన వాతావరణంలో ఫోన్‌ను ఉంచడం వల్ల ఏదైనా తేమ ఉంటే బియ్యం పీల్చుకుంటుంది. ఇలా చేయడంవల్ల ఫోన్ యధావిధిగా ఉపయోగించవచ్చు.