ఉచితంగా శిక్షణ, ఉద్యోగం.. ఈ ప్రభుత్వ స్కీమ్ గురించి మీకు తెలుసా?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కూడ ఒకటి. 2014 సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

http://ddugky.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 15 న్నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. పట్టణ స్థాయి యువతకు అనుగుణంగా గ్రామీణ స్థాయి యువత పోటీ ఇవ్వడం సులువు కాదనే సంగతి తెలిసిందే.

అలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా నైపుణ్యాల శిక్షణ జరగనుంది. సామాజికంగా వెనుకడిన కులాలకు చెందిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శిక్షణతో ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మద్దతు అందించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం.

దాదాపుగా అన్ని రాష్ట్రాలలో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం అమలులో మూడు దశలు ఉంటాయి. ఈ స్కీమ్ గురించి వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పేద యువతీయువకులకు ఈ స్కీమ్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది.