రజనీకాంత్ ఛానల్ వచ్చేస్తుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుతో ఓ టెలివిజన్ ఛానల్ వచ్చేస్తుంది . ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా చెప్పాడు . ఛానల్ పేరు ” రజని మక్కల్ మంద్ర “. ఈపేరు రిజిస్టర్ చేస్తున్నట్టు రజని తెలిపాడు .

తన తరుపున ఈ ఛానల్ మిత్రులు రిజిస్టర్ చేస్తున్నారు . ఈ పేరు ట్రేడ్ మార్క్ క్రింద రిజిస్టర్ చెయ్యమని రజని రిజిస్టర్ కు ఓ లేఖ రాసినట్టు తెలిపాడు . కుటుంబంతో కొన్ని రోజులు అమెరికాలో గడపటానికి వెడుతూ రజని ఈ విషయం చెప్పాడు .

అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో వస్తానని ప్రకటించడం తప్ప క్రియాశీలకంగా మారలేదు . వచ్చే ఎన్నికల్లో రజనీ కాంత్  పోటీ చేస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టం చెయ్యలేదు . ” రజని మక్కల్ మంద్ర “. ఛానల్ మాత్రం వస్తున్నట్టు తెలిపాడు