Jailer 2: తెలుగు రైట్స్‌కు భారీ డీల్.. జైలర్ 2 రిస్క్ లోకి వెళ్తుందా?

రజనీకాంత్ అభిమానులకు ‘జైలర్’ సినిమాతో వచ్చిన సర్ప్రైజ్ ఇప్పటికీ మదిలో ఉంది. మొదటి భాగం ఊహించని రేంజ్‌లో హిట్ అవుతుందని ఎవరూ అంచనా వేయలేదు. అయితే ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి సీక్వెల్ రాబోతున్న నేపథ్యంలో ‘జైలర్ 2’ హవా తెలుగు స్టేట్స్‌లో బిజినెస్ పరంగా కొత్త దిశలో దూసుకెళ్తోంది.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో ఒక సంస్థ ఏకంగా రూ.60 కోట్లకు బిడ్డింగ్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఇది గత సినిమాకి మూడు రెట్లు ఎక్కువ ధర. అయితే డిమాండ్ ఎక్కువగా ఉన్నా… ఇది ఓవర్ ప్రైస్ అవుతుందా అన్నదే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్ లో చర్చ.

ముఖ్యంగా ‘జైలర్ 2’ విడుదల సమయానికి ‘వార్ 2’ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ఇది మరింత క్లిష్టమైన స్థితిని తలెత్తించనుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే ‘జైలర్ 2’కి మార్కెట్‌లో పోటీ తప్పదు. గతంలో ‘జైలర్’కు లక్కీగా పోటీ లేకుండా పెద్ద ప్లాట్‌ఫామ్ దొరకగా, ఈసారి అలాంటి అదృష్టం ఉండకపోవచ్చు.

అందుకే రూ.60 కోట్ల బిడ్డింగ్‌ డీల్‌పై డిస్ట్రిబ్యూటర్లు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్క రజనీకాంత్ బ్రాండ్ ఉన్నా సరే, ఈసారి కంటెంట్‌, టైమింగ్‌, మార్కెట్ హైప్ అన్నీ కీలకం. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వేస్తే, లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘జైలర్ 2’ నిజంగా అదే స్థాయిలో మేజిక్ చేస్తుందా? లేక రిస్కీ డీల్‌గా మిగిలిపోతుందా? అనేది వేచి చూడాల్సిందే.

అరెస్టు చేస్తే ఆత్మార్పణే || Lady Aghori Varshini Shocking Video || Sri Varshini Marriage || TR