కోన వెంకట్… ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. రచయితగా వరుస విజయాల తరవాత ఇప్పుడు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నీరజ కోన అనతి కాలంలో టాప్ స్టయిలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లకు.. కొంత మంది హీరోలకు స్టయిలిస్ట్‌గా వర్క్ చేశారు. అయితే… అన్నయ్య బాటలో నడిచి ఈ ఏడాది పెన్ను కూడా పట్టుకున్నాడు. ఇండస్ట్రీలోని ఈమె బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరైన నితిన్ ‘చల్ మోహన్‌రంగ’తో లిరిక్ రైటర్‌గా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అందులోని ‘మియామి..’ పాత రాసిందీవిడే. అప్పట్లో విరివిరిగా పాటల రాసే ఆలోచన లేదని చెప్పారీమె. అయితే… ఆమెలోని లిరిక్ రైటర్‌ని గుర్తించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు అవకాశాలు ఇస్తున్నారు. ఈ ఏడాది మరో మూడు పాటలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలో పాటలు, సినిమా వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. అనౌన్స్ చేయడానికి రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నార్ట.