సీఎం కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటీల రాజకీయాలు చేసేది మీరని ఇతరులను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. మీరు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పా అని ఆమె ప్రశ్నించారు. కేంద్రంతో లాలూచి పడి ఇతరులను నిందిస్తారా అని అన్నారు. విజయశాంతి ఇంకా ఏమన్నారంటే…

“అధికారాలు, హక్కుల పంపిణీలొ కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసారు. నీతులు ఇతరులకు చెప్పడానికేనా? మీరు కూడా పాటిస్తారా ముఖ్యమంత్రి గారూ? కేంద్రం చూపే వివక్ష గురించి మాట్లాడుతున్నారు, మరి మీరు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎం.ఎల్.ఏ లకు నిధులు కేటాయించకుండా వేధించడాన్ని ఏమంటారు? కేంద్రం చేసేది తప్పు అయితే మీరు చేసే పని దుర్మార్గం. నాయకుల మీద కక్షను ఓటు వేసిన ప్రజలపై చూపడం దారుణం.

అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందనేది ఉత్తిమాట. ప్రశ్నించేవారు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఇది పచ్చినిజం.కేంద్రం నుంచి నిధుల కోసం మీరు పక్క రాష్ట్ర పార్టీలతో కలుస్తున్నామంటున్నారే… మరి మీ సర్కార్ నుండి నిధుల కోసం కాంగ్రెస్ నుండి పోటీ చేసిన, గెలిచిన అభ్యర్థులు మీ పార్టీలో కలవాలంటున్నారు. ఇదేం న్యాయం? 

గజ్వేల్ నుండి టీఆరెస్ లో చేరటానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థి చెబుతున్న మాటలను తెలంగాణ సమాజం విశ్వసించటం లేదు. ఆ ప్రకటనను టీఆరెస్ సమర్థిస్తుందా?” అని విజయశాంతి అన్నారు.