వారిపై టిఆర్ఎస్ సీరియస్, ఇద్దరు అరెస్ట్, మరో ఇద్దరిపై కేసులు

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కన్నెర్రజేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎందుకు టిఆర్ఎస్ సీరియస్ అయింది. వారిని ఎందుకు అరెస్టు చేశారు? చదవండి.

సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు చేస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఉన్నారు. వీరు తరచుగా కేసిఆర్ మీద, కేటిఆర్ మీద బూతు అర్థాలు వచ్చేలా పోస్టులు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

టిఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అరెస్టయిన వారి వివరాలు.. నిజాం పేటకు చెందిన ధూళిపాళ్ల రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసి సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి కేసిఆర్, కేటిఆర్ కు వ్యతిరేకంగా అవమానకరంగా పోస్టులు సోషల్ మీడియాలో చేస్తున్నాడన్న ఆరోపణలుతో అరెస్టు చేశారు.

కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ కు చెందిన వ్యాపారి పోట్లూరి రమేష్ బాబు స్థానిక టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కు వ్యతిరేకంగా అనుచితమైన పోస్టింగ్ లు సోషల్ మీడియాలో పెడుతున్నాడని, మాధవరం ఫిర్యాదు మేరకు ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

జైల్ సింగ్ నగర్ కు చెందిన మల్లేష్, డాన్ రాజు ఇద్దరూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ మీద అనుచితమైన పోస్టింగ్ లు పెట్టారు. దీంతో టిఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు వారిద్దరి మీద కేసులు నమోదు చేశారు. త్వరలోనే వీరిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

బి అలర్ట్ :

సోషల్ మీడియా రోజు రోజుకూ విస్తరిస్తున్న తరుణంలో అదుపు తప్పి పోస్టింగులు పెడితే పోలీసు కేసులు తప్పవని హెచ్చరిస్తున్నది పోలీసు శాఖ. వీలైనంత వరకు అసభ్య పదజాలం, అనుచితమైన కామెంట్స్ లేకుండా పోస్టులు చేయాలని సూచిస్తున్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు చేయరాదని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిందని అంటున్నారు.

ప్రజా సమస్యలను వెలికితీయడంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోటీ పడుతున్నది సోషల్ మీడియా. కానీ డెమెక్రటిక్ మార్గంలో సోషల్ మీడియా పనిచేసి అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తే తప్పు లేదు కాని రాంగ్ రూట్ లో వెళ్తే మాత్రం ప్రమాదాలు తప్పవని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.