బాత్రూంలో జారి పడ్డ టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే

టిఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా జారి పడ్డాడు. బాత్రూంల కింద పడటంతో చల్లా ధర్మారెడ్డి తలకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని మ్యాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచనతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అపాయం ఏం లేదని వైద్యులు తెలిపారు.

చల్లా ధర్మారెడ్డి పరకాలకు ఎమ్మెల్యేగా పనిచేశారు. మళ్లీ పరకాల నుంచే ఆయన ఈ సారి రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ఎమ్మెల్యే జారి పడటంతో నియోజకవర్గ నేతలు తీవ్రనిరాశకు లోనయ్యరు. ధర్మారెడ్డి త్వరగా కోలుకోవాలని వారు కాంక్షించారు.