వైసీపీ పతనానికి జగన్ చేస్తున్న ఈ తప్పులే కారణం.. ఆ విషయాల్లో మారాల్సిందేనా?

కొన్నేళ్ల క్రితం వరకు వైసీపీ ఏ ఎన్నికలో పోటీ చేసినా అనుకూల ఫలితాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజల్లో జగన్ పై పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. జగన్ సైతం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావడంతో పాటు ప్రజల మద్దతు పొందారు. దేశంలోని బెస్ట్ సీఎంలలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు. జగన్ వల్లే గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువేననే సంగతి తెలిసిందే.

అయితే గత నాలుగేళ్ల నుంచి జగన్ పై వ్యతిరేకత సైతం పెరుగుతోంది. ఉద్యోగులలో జగన్ పై అసంతృప్తి పెరుగుతుండగా జగన్ అందరితో కలిసిపోకపోవడం, ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం, అభివృద్ధి దిశగా అడుగులు వేయకపోవడం, స్పందన ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అలాగే ఉండటం వైసీపీ పతనానికి కారణాలయ్యాయి.

కనీసం రోడ్ల విషయంలో సైతం జగన్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు సైతం అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. జగన్ ఈ ఓటమిని గుర్తు పెట్టుకుని ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

అదే సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రజల నమ్మకాన్ని పొందే దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది. సీఎం జగన్ అభివృద్ధిపై ఇకనుంచి అయినా దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.