జనసేనాని సినీ రాజకీయం.! ఏం జరుగుతోందబ్బా.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాల్లో ఎక్కువ బిజీగా వున్నారు. ఓ సినిమా సెట్స్ మీద వుంటే, ఏకంగా మూడు సినిమాలు షూటింగ్‌కి వెళ్ళాల్సి వుంది. కాదు కాదు.. రెండు సినిమాలు సైమల్టేనియస్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయనే ప్రచారమూ లేకపోలేదు.

ఇదిలా వుంటే, సినిమా షూటింగ్ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహాలు చక్కబెడుతున్నారట. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ వ్యవహారాలతో షూటింగ్ సమయంలో కూడా తీరిక లేకుండా వుంటున్నారట పవన్ కళ్యాణ్. అంతే కాదు, తనను కలిసేందుకు వస్తోన్న రాజకీయ ప్రముఖఉలతోనూ చర్చోపచర్చలు జరుపుతున్నారట.. అదీ షూటింగ్ స్పాట్‌లోనేనని అంటున్నారు.

తాజాగా, వివిధ పార్టీల నుంచి దూతల తాకిడి పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్స్‌కి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ భేటీల కోసం షూటింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయవలసి వస్తోందట. అయితే, ఆ ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ భరిస్తున్నారన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. జనసేన నేతలెలాగూ పవన్ కళ్యాణ్ వద్దకు వెళతారు.

మరి, ఇతర పార్టీల నేతల సంగతేంటి.. మిత్ర పక్షం బీజేపీ తరఫున మాత్రమే కాదు టీడీపీ నుంచీ, గులాబీ పార్టీ నుంచి కూడా నేతలు పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్స్‌కి వెళుతున్నారట. అంతే కాదు, వైసీపీకి చెందిన ఓ నేత (ఉత్తరాంధ్రకి చెందిన నేత అని సమాచారం) ఇటీవల జనసేన అధినేతని షూటింగ్ స్పాట్‌లో కలిసి చర్చించారట.. అదీ అత్యంత రహస్యంగా..! సీరియర్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ చేయకపోయినా, ఆయన్ని కొందరు నాయకులు సీరియస్‌గానే తీసుకుంటున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?