కెటియార్ ను పీడిస్తున్న మూడక్షరాల భయం…

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కెటి రామారావుకు మూడక్షరాల భయం పట్టుకుంది.

ఇది బాగా  ఆయనను వేధిస్తున్నది.

ఈ భయం పోవాలంటే ఏమేమీ చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటున్నారు. 

2019లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాదేమోనన్న భయం కాదది. ఈ విషయంలో టిఆర్ ఎస్ సెకండ్ ఇన్ కమాండ్ కు అనుమానం లేదు. 2019 ప్రభుత్వం ఏర్పాటు చేసేది తన పార్టీ యే నని ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం చేయించిన సర్వేలన్నీ ఇదే రుజువుచేశాయి.

అంతేకాదు, వచ్చేసారి అసెంబ్లీలో పార్టీని ప్రభుత్వాన్ని, తనని విమర్శించేందుకు కాంగ్రెస్ కూడా కనిపించదని కూడా నమ్ముతున్నారు.

బిజెపి కూడా ఒకటో అరో గెల్చుకుని ఒక మూల కూలబడి ఉంటుందని ఆయన నమ్మకం.

ఇక ప్రొఫెసర్ కోదండ్ రామ్ ప్రభావం ఏమీ ఉండదని, ఆయన మరొక జయప్రకాశ్ నారాయణ్ అవుతారని, ఎన్నికల తర్వాత ఆయన అమెరికా వానప్రస్తం వెళ్లిపోతారని కూడా కెటిఆర్ నమ్ముతున్నారు.

మరింకేంటి భయం…. అందునా మూడక్షరాల భయం…

ఆ భయం ఏమిటో తెలుసా…

ఆ భయం ‘‘రేవంత్ ’’ అనే మూడక్షరాలు.

ఈ మూడక్షరాలను ఆయన అధికారంలో ఉన్నా, మందీ మార్బలం  ఉన్నా, ట్వీట్టర్ సైగ చేసే పని చేసేపెట్టే పోలీసులున్నా, క్యాాబినెట్ మంత్రులున్నా… ఈ మూడక్షరాలను ఆయన చెరిపేయలేకుండా ఉన్నారు, మర్చిపోలేకుండా ఉన్నారు,  చూడకండా వినకుండా ఉండలేకుండా ఉన్నారు.

తెలంగాణ సూపర్ స్టార్ ను ఇంతగా పీడిస్తున్న ఈ మూడక్షరాలు మంత్రశక్తి ఏమిటి?

ఎందుకలా రేవంత్ అనే మాట భయపెడుతూ ఉంది.

ఎందుకంటే, ఏ సర్వేలో కూడా రేవంత్ బలహీనుడని, రేవంత్ ను 2019 మట్టి కరిపించవచ్చని రావడం  లేదట. సర్వేలన్నీ రేవంత్ బలాఢ్యుడు. రేవంత్ ప్రాణం ఎక్కడుందో కూడా స్పష్టంగా తెలియడం లేదట.

కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినా , ఒక్క రేవంత్ అనే వ్యక్తి  అసెంబ్లీలో ఉంటే… యాగి చేసేస్తాడు. రేవంత్ అనే పేరు అసెంబ్లీలో వినిపించకుండా పోతుందనుకుంటే వేగులవారి నివేదికలు దానికి భిన్నంగా ఉన్నాయ్.

వచ్చేధఫా రేవంత్ అనే వాడు సభలో ఉంటే… నోటి కొచ్చినట్లు చెప్పేస్తాడు. ఫ్యామిటీ అవినీతి అంటూ ఏమోమో మాట్లాడతాడు. దీన్నంతా నిమిషాల్లో దేశం నలుమూలలకు చేరవేసేందుకు వీడికి సోషల్ మిడియా పెద్ద అభిమానసేన ఉంది.  2014లో గెల్చినందుకే వీడిని పట్టుకోలేకపోతున్నాం, 2019లో గెలిస్తే…

‘లేదు… అలా జరగడానికి వీల్లేదు…’ అని తీర్మానించుకున్నారు. ‘సమావేశంలో ఉన్నవారంతా సై’ అన్నారట.

వెంటనే మంత్రులు మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గుర్నాద్ రెడ్డిలను  వార్ రూం లోకి పిలిపించుకుని తన మనసులో మాట చెప్పి 2019 ఎన్నికల్లో కోడంగల్ అనే పనికిమాలిన నియోజకవర్గం  మొత్తం పింకైపోవాల. రేవంత్ డంగై పోవాల అని చెప్పారట.  ఈ సమావేశం రెండు రోజులకిందట చాలా గోప్యం గా జరిగిందని లోగుట్టు తెలిసిన వాళ్లు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు.

కోడంగల్ లొ రేవంత్ ని చిత్తు చేసే వ్యక్తి ఎవరని ఆలోచించారు.చివరకు మంత్రిగారి సోదరుడు ఆ నియోజకవర్గంలో వీరుడని తెల్చినట్లు తెలిసింది. మంత్రి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని యుద్ధానికి సన్నద్ధం కావలని అక్కడికక్కడే పురమాయించారట.

మరి ఇంతవరకు అనుకున్న నియోజకవర్గం ఇన్చార్జ్ గుర్నాద్ రెడ్డి ని ఎలా తప్పించారని ప్రశ్న రావచ్చు.

దీనికోసం ఒక సర్వే ని ప్రయోగించారు. కోడంగల్లో రేవంత్ అనే మూడక్షరాలను తుడిచేసే శక్తి  పట్నం నరేందర్ రెడ్డికే ఉందని, గుర్నాధరెడ్డి  అంగబలం, అర్థబలం లేవని సర్వేలు తేల్చాయని, సర్వే ప్రకారమే టిఆర్ ఎస్ నడుచుకుంటుందని, కావాలంటే, గర్నాధ రెడ్డిని మరొక విధంగా ఆదుకుంటామని చెప్పారు.

అంతేకాదు, పట్నం నరేందర్ రెడ్డి ని వెంటనే పని ప్రారంభించాలని , కోడంగల్ లోనే మకాం వేసి, రేవంత్ ని బలహీన పర్చేందుకు, అపకీర్తి పాలు చేసేందుకు ఏ ఏ కార్యక్ర మాలు చేపట్టాలో చెబితే,  ప్రభుత్వం నుంచి అవన్నీ చేయిస్తానని  కూడా హమీ ఇచ్చి,  ఎమర్జీన్సీ మీటింగ్ ముగించారని తెలిసింది.

వార్ రూంలో నిర్ణయించిన యాక్షన్ ప్లాన్ వివరాలు

  1. ఇక నుంచి మంత్రులు,  నియోజకవర్గంలో బంధుత్వాలు, సంబంధాలున్న నాయకులు రెగ్యులర్ కోడంగల్ లో పర్యంటిచ సభలు సమావేశాలు జరపాలి.
  2. నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనులన్నంటిని సత్వరం పూర్తి చేసి పార్టీకి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలి
  3. నిధుల కొరత లేకుండా చూడాలి
  4. రేవంత్ రెడ్డి సన్నిహితుల్లో బలమయన వాళ్లనందరిని టిఆర్ ఎస్ లోకి లాగేయాలి.
  5. పెన్షన్లను, ముఖ్యమంత్రి సహాయనిధి, షాది ముబారక్ కింద సహాయం తక్షణం వచ్చేల చూడాలి.

 

రేవంత్  అనే  మూడక్షరాలను కెటిఆర్ ఈ వ్యూహం తో చెరిపేయగలడా? ఈ వ్యూహం మూడక్షరాల భయం పోతుందా, రేవంత్ నోరు మూత పడుతుందా?