కేసీఆర్ ని అష్ట దిగ్బంధనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం !

Is the Central Government planning to end KCR completely?

తెలంగాణ: కొన్ని నెలలుగా కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దంటూ బీజేపీ పార్టీ చేస్తున్న హెచ్చ‌రికలు గమనిస్తే ఏదో జరగబోతుందని రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. తగ్గట్లుగానే కేసీఆర్ స‌న్నిహితుల కంపెనీల‌పై ఐటీ దాడులు మొద‌ల‌య్యాయి. ఇవి కేవ‌లం రెగ్యూల‌ర్ గా జ‌రిగేవే అని కంపెనీ చెప్పుకున్నా… ఆ త‌ర్వాత ఆయా కంపెనీల నుండి స‌బ్ కాంట్రాక్టులు పొందిన కంపెనీల‌పై ఐటీ, ఈడీ దాడులు మొద‌లయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టులు అప్పజెప్పిన కంపెనీల‌పైనే ఈడీ, ఐటీ దాడుల వెనుక మర్మం ఏంటీ, కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా…అన్న అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Is the Central Government planning to end KCR completely?
Is the Central Government planning to end KCR completely ?

కేసీఆర్ కు అరెస్టుల భ‌యం ప‌ట్టుకుందని, అందుకే అప్ప‌టి వ‌ర‌కు చెప్పిన మాట‌లని తుంగలో తొక్కి … ప్లేట్ ఫిరాయియించేస్తున్నాడు. కేసీఆర్ యూటర్న్ తీసుకొని… బీజేపీ అనుకూల స్టాండ్ తీసుకుంటున్నప్ప‌టికీ కూడా దాడులు ఆగ‌టం లేదు. ఆ దాడుల్లో సంస్థ‌ల‌న్నీ అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డాయ‌ని తేలిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టిన సంస్థ‌ల‌తో పాటు ఇప్పుడు మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌పై కూడా దాడులు జ‌రుగుతున్నాయి. దీంతో కేసీఆర్ ను పూర్తిగా అష్ట దిగ్బంధనం చేసే వ‌ర‌కు కేంద్రం విడిచిపెట్టేలా లేద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుంది.