వాళ్లకు అదిరిపోయే తీపికబురు చెప్పిన మోదీ సర్కార్.. రూ.300 జమ కానున్నాయా?

మోదీ సర్కార్ అధికారంలో ఉండగా పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ రాగా ఈ స్కీమ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులకు ఈ అవకాశం అనేది మార్చి 31, 2024 తో ముగియాల్సి ఉండగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను మరో సంవత్సరం పాటు పొడిగించడం గమనార్హం.

ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు సంవత్సరానికి 12 సిలిండర్లు పొందేందుకు అర్హత ఉంటుంది. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే రూ.300 తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం ఉండటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్లకు బెనిఫిట్ కలగనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు 955 రూపాయలుగా ఉండగా కేంద్రం 40 రూపాయలు సబ్సిడీ అందిస్తోంది.

మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సలిండర్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుండటం గమనార్హం. అయితే ఉజ్వల స్కీమ్ లో వాళ్లు కూడా మహాలక్ష్మి స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా మూడు సిలిండర్లను అందించనుంది. ఉజ్వల స్కీమ్ కోసం కేంద్రం ఏకంగా 12000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైంది.

ఉజ్వల స్కీమ్ గురించి ఇప్పటికీ తెలియని వాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునే దిశగా అడుగులు వేస్తే మంచిది. ఉజ్వల స్కీమ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను కలిగిస్తోంది. సమీపంలోని గ్యాస్ డీలర్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.