కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా కొన్ని స్కీమ్స్ ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఒక స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకంగా 14 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశాలలో విద్యను అభ్యసించే వాళ్లకు సహాయం చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత విభాగం నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడింది. విదేశాల్లో ఎంఎస్, పీహెచ్డీ కోర్సులు చదవడానికి ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nosmsje.gov.in/nosmsje/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన వాళ్లకు నెలకు ఏకంగా 15400 డాలర్లు లభిస్తుంది. మన దేశ కరెన్సీ ప్రకారం ఏకంగా 14 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇవ్వడంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, యాక్సిడెంటల్ జర్నీ అలవెన్స్, ఎయిర్ ప్యాసేజ్, ట్యూషన్ ఫీజు, వీసా ఫీజులను కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ నెల చివరి వరకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కాలర్ షిప్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది. స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి తక్కువ సమయం ఉండటంతో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ పై దృష్టి పెడితే మంచిది.