Today Horoscope : జనవరి 15th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today-february-23rd-2021-daily-horoscope-in-telugu

మేష రాశి: ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. పరిచయస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు పని ప్రదేశంలో మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపార పర్యటనలు మీకు కలిసి వస్తాయి. ఈరోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ వాతావరణంలో శాంతి ఉంటుంది. ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పిల్లల పురోగతితో మనస్సు సంతోషంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ అష్టోతరాన్ని ఉదయం, సాయంత్రం పఠించండి.

వృషభ రాశి: ఈరోజు మిత్రులతో కలహాలు !

ఈరోజు పనుల్లో జాప్యం. వాహనాల వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఈరోజు ప్రయాణాలలో మార్పులు. ఈరోజు ప్రశాంతంగా ఉండి పని చేయండి. నూతన ప్రణాళికలను చర్చించుకుంటారు. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రత్యేక అతిథి మీ ఇంటికి వస్తారు. ఈరోజు మిత్రులతో కలహాలు. బియ్యం పంపిణీ చెయ్యండి.

మిథున రాశి:  ఈరోజు వ్యాపారలో కొత్త పరిచయాలు !

ఈరోజు పురోగతి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. బంధుగణంతో విభేదాలు. ఈరోజు వ్యాపారంలో నూతన ఉత్పత్తులు మీకు లాభం చేకూరుస్తాయి. పాత బాధ్యతల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాయి. వ్యాపారలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పనులు వాయిదా వేస్తారు. ఈరోజు విద్యార్థుల వారి భవిష్యత్తు కోసం నూతన వ్యూహాలను పరిశీలిస్తారు. శివాష్టోతరం పారాయణం చేస్తే మంచిది.

కర్కాటక రాశి: ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు శుభవార్తలు వింటారు.పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్య కోసం విద్యార్థులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కుటుంబంలో వారసత్వ గుర్తింపు ఉంటుంది. ఈరోజు మీకు తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఆర్థిక సమతూల్యతను కాపాడుకోండి. వ్యర్థమైన లావాదేవీలను నివారించండి. వినాయకుడిని ఆరాధించండి.

సింహ రాశి: ఈరోజు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం !

ఈరోజు ఉపాధి రంగంలో చాలా అవకాశాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు పనిభారం పెరుగుతుంది. అధికారుల సహాకరం ఉంటుంది. ఈరోజు వ్యాపార సమస్యల గురించి ఆందోళన చెందవచ్చు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఈరోజు అస్థిరతను వదిలేయాల్సి ఉంటుంది. వస్తులాభాలు. మీరు కుటుంబ సమస్యల నుంచి శుభవార్తలు పొందుతారు. ఈరోజు జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందుతారు. శివానంద లహరి పారాయణం చెయ్యండి.

today january 15th 2021 daily horoscope in telugu
today january 15th 2021 daily horoscope in telugu

కన్య రాశి:  శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి.ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. పని ప్రదేశంలో నూతన మార్పులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. వాణిజ్య వ్యాపారాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈరోజు సోదరులతో విభేదాలు పరిష్కారం. సామాజిక ప్రతిష్టను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరీ సోదరమణుల సహాయంతో అనేక సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. విష్ణు భగవానుడు లేదా దుర్గా దేవి దేవత వద్ద కాంస్య పాత్రలు సమర్పించండి.

తుల రాశి: ఈరోజు విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి !

ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. క్రమంగా మీ సమస్యలు ముగుస్తాయి. పనుల్లో ఆటంకాలు. ఈరోజు కుటుంబ వ్యాపారంలో తండ్రి మద్దతు, మార్గదర్శకత్వం ప్రయోజకరంగా ఉంటుంది. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ధనవ్యయం. ఈరోజు మీరు కష్టపడి పనిచేస్తే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంతోషిదేవి మాతా పూజను చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకుంటారు !

ఈరోజు పనిప్రదేశంలో సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారాలలో అభివృద్ధి. లాభాల పరిస్థితులను సృష్టించుకుంటారు. ఈరోజు ఆకస్మిక వార్తలు వస్తాయి. పని, వ్యాపార రంగంలో ఒత్తిడి మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వదు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఈరోజు మారుతున్న వాతావరణంలో నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈరోజు సంపద పెరుగుతుంది. నిస్సహాయ ఆలోచనలు జ్ఞప్తికి రానివ్వకండి. ప్రాతః కాలంలో ధ్యానం లేదా యోగా చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు కొన్ని పనులు వాయిదా !

ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు మీకు ప్రయోజకరంగా ఉంటుంది. ఈరోజు నూతన వ్యక్తుల పరిచయాల నుంచి లాభాలు అందుకుంటారు. ఆగిపోయిన డబ్బు కష్టంతో తీర్చుకుంటారు. వృత్తిపరమైన వృద్ధి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈరోజు విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు లభిస్తుంది, పోటీ పరీక్షల్లో బాగా కృషి చేస్తారు. సంకట గణపతి స్తోత్రం పఠించండి.

మకర రాశి: ఈరోజు గౌరవం పెరుగుతుంది !

ఈరోజు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు పనిప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక శాంతిని చేకూరుస్తుంది. స్థిరాస్తి వృద్ధి. శ్రీసూక్త పారాయణం లేదా శ్రవణం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది.

కుంభ రాశి: పనుల్లో ప్రతిబంధకాలు !

ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఈరోజు ఉన్నతాధికారుల సాన్నిహిత్యం నుంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధిచి నూతన అవకాశాలు లభిస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు. ఈరోజు సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం వల్ల మీకు కలిసి వస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.

మీన రాశి: ఈరోజు పోటీలో విజయం !

ఈరోజు దీర్ఘకాలిక అప్పుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. వ్యాపార విషయాల్లో అవరోధాలు తొలగించుకుంటారు. ఈరోజు పోటీలో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఈరోజు బంధువులతో వివాదాలు పరిష్కారం. ఈరోజు అధ్యయనాలు, ఆధ్యాత్మికతలపై ఆసక్తి కనబరుస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు పనులు చకచకా సాగుతాయి.