రాముడిని పూజించే సమయంలో చేయకుడని తప్పులివే.. ఏం చేయాలంటే?

మనలో చాలామంది ఎంతో భక్తితో పూజించే దేవుళ్లలో శ్రీరామచంద్రుడు ఒకరనే సంగతి తెలిసిందే. శ్రీరాముడి అనుగ్రహం ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. శ్రీరాముడిని పూజించే సమయంలో నియమనిష్టలు పాటిస్తూ పూజలు చేయాలి. ఎవరైతే ఈ విధంగా శ్రీరాముడిని పూజిస్తారో వాళ్లకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

 

శనివారం రోజున శ్రీరాముడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. శ్రీరాముని జాతకం ప్రకారం ఆయన జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థానంలో ఉండటం గమనార్హం. పూజా మందిరంలో రాముని జాతకాన్ని ఉంచి పూజిస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పూజా మందిరంలో శ్రీరాముని జాతకం ఉంచితే జాతకపరంగా ఉండే దోషాలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

శనివారం రోజున రావిచెట్టు దగ్గర నీటిలో పాలతో పాటు చక్కెర కలిపి నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శనివారం రోజున రాముడి పేరును కాగితంపై రాసి ఆ కాగితంను పిండితో కలిపితే శని దోషాలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. ఈ పిండిని గుళికలుగా చేసి చేపలకు తినిపిస్తే మంచి ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

ఈ విధంగా చేయడం ద్వారా శని దోషాలతో పాటు శని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. శని దోషాలు తొలగిపోతే లైఫ్ లో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. రుణ సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.