Today Horoscope: జనవరి 22వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: చేపట్టిన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు అధిగమిస్తాయి!

చేపట్టిన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు అధిగమిస్తాయి. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో ఉంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభరాశి: నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి!

నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద పలుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వాదాలు పరిష్కరించుకుంటారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మిధునరాశి: చేపట్టిన పనులు చకచగా సాగుతాయి!

చేపట్టిన పనులు చకచగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కర్కాటక రాశి: ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది!

ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బులు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

సింహరాశి: దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి!

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల ప్రయాణాల్లో తొందరపాటు పనిచేయదు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. మానసిక బలహీనత ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది.

కన్యరాశి: నూతన పనులకు శ్రీకారం చుట్టి సకలంలో పూర్తి చేస్తారు!

నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది

తులరాశి: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు!

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనల్లో నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి: ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు!

ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు చేయడంమంచిది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

ధనుస్సురాశి: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు!

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలకు పరిష్కరించుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు పలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. భూ క్రమ విక్రమాల స్వల్ప లాభాలు అందుతాయి. ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

మకరరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభరాశి: వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి!

వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. భూ క్రమ విక్రమాల్లో లాభాలు పొందుతారు. ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

మీనరాశి: దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి!

దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తల అందుతాయి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. వాహనాల ప్రాణాలు తొందరపాటు పనిచేయదు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశముంది.