టిఆర్ఎస్ కు ఎలక్షన్ కమిషన్ తొలి ఝలక్

టిఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తొలి ఝలక్ ఇచ్చింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత తగిలిన మొట్టమొదటి ఝలక్ ఇదే. ఇంతకూ ఆ ఝలక్ ఏందబ్బా అనుకుంటున్నారా? చదవండి.

తెలంగాణలో బతుకమ్మ పండుగ వేళ నేత చీరెలను పంపిణీ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు  చేసింది. అయితే ఆ చీరెల పంపిణీ చేపట్టకముందే ప్రభుత్వం దిగిపోయింది. అయినా గత ఏడాది మొదలు పెట్టిన స్కీం కాబట్టే ఇది కంటిన్యూ అవుతుందని టిఆర్ఎస్ భావించింది. 

కానీ కాంగ్రెస్ నేతలు గూడూరు నారాయణరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లెంట్ చేశారు. బతుకమ్మ చీరెల పంపిణీ ఎన్నికలు ముగిసే వరకు ఆపాలని కోరారు. చీరెలు పంపిణీ అనేది ఓటర్లను ప్రలోభ పెట్టేదిగా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో వారి ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం బతుకమ్మ చీరెల పంపిణీ ఓటర్లను ప్రలోభ పెట్లే కార్యక్రమంగా భావించి బతుకమ్మ చీరలు పంపిణీ చేయరాదని ఆదేశాలిచ్చింది. 12, అక్టోబరు 2018న చేపట్టనున్న బతుకమ్మ చీరెల పంపిణీని ఎన్నికల సంఘం అంగీకరించడంలేదని లేఖలో పేర్కొన్నది ఎన్నికల కమిషన్. 

మంగళవారమే ఈ లేఖను వెలువరించింది ఎన్నికల సంఘం. అయితే ఈ విషయంలో మరో పథకం కూడా పెండింగ్ లో పడే చాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. రైతు బంధు చెక్కుల పంపిణీ కూడా ఆలస్యం కావొచ్చన్న చర్చ ఉంది. ఎందుకంటే నాలుగైదు వందల రూపాయల విలువైన చీరెల పంపిణీనే ఎన్నికల కమిషన్ నిలిపివేసినప్పుడు వేల రూపాయల పంపిణీ అయిన రైతు బంధు చెక్కులను ఎలా అనుమతిస్తుందన్న చర్చ ఉంది.

అయితే ఇంకా రైతు బంధు చెక్కుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. రైతు బంధు కూడా ఇదే తరహాలో పెండింగ్ లో పడే చాన్స్ ఉందంటున్నారు. ఈ రెండు పథకాలు పెండింగ్ లో పడే పరిస్థితి ఉంటే టిఆర్ఎస్ పార్టీకి కొంతలో కొంత నష్టమే అన్న చర్చ అయితే మొదలైంది.

ఈ విషయంలో ఇప్పటికే టిఆర్ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. బతుకమ్మ చీరెలు పంపిణీ పాత పథకమే కదా అని టిఆర్ఎస్ వాదిస్తున్నది. అంతేకాదు రైతు బంధు కూడా గత టర్మ్ లో ఇచ్చాము.. ఇప్పుడు చెల్లించడానికి అభ్యంతరమేంటని టిఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ మీద టిఆర్ఎస్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నది.

కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం ద్వారానే బతుకమ్మ చీరెల పంపిణీ చేయలేకపోయామని, ఇందులో తమ తప్పేమీ లేదని తప్పంతా కాంగ్రెస్ పార్టీదే అని టిఆర్ఎస్ విమర్శల దాడి షురూ చేసింది. అంతేకాదు రైతు బంధు చెక్కులు రాకపోయినా కాంగ్రెస్ వారే చేయించారని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేసే చాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే టిఆర్ఎస్ మల్లా వస్తేనే రైతు బంధు పథకం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని ఎత్తేసే ప్రమాదముందని కూడా టిఆర్ఎస్ విమర్శల వర్షం కురిపించే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి బతుకమ్మ చీరెలు కానీ, రైతు బంధు పథకం కింద చెక్కులు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాతే లబ్ధిదారులకు చేరే అవకాశం మాత్రం కనబడుతున్నది. కాంగ్రెస్ మాత్రం టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చామని, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయగలిగామన్న ఉద్దేశంతో ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖ కింద ఉంది చూడండి.

బతుకమ్మ చీరెల పంపిణీకి బ్రేక్ వేయాలని ఈసి ఆదేశం

 

హరీష్ రావు కు పొమ్మనకుండా పొగ పెడతున్నారా??? ఈ వార్త కోసం కింద లింక్ క్లిక్ చేయండి …

https://telugurajyam.com/blanket-ban-on-harish-raos-news-in-pro-trs-media/