ప్రగతి సభ వేదికపై ఎంపి బూర నర్సయ్యకు అవమానం

 

ప్రగతి నివేదన సభ వేదికపై లోకల్ ఎంపి బూర నర్సయ్య గౌడ్ కు అవమానం జరిగిందని బిసి సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. స్థానిక ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ ను సభ సాక్సిగా అవమానించాడని మండిపడుతున్నారు. అసలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎందుకు అవమానించారు? ఏం జరిగింది? వివరాలు చదవండి.

ప్రగతి నివేదన సభలో టిఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్లు మాత్రమే స్పీచ్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సభకు. జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ మాత్రమే మాట్లాడారు. వారంతా మాట్లాడిన తర్వాత సిఎం కేసిఆర్ కీలక ప్రసంగం చేశారు.

ఆ తర్వాత సభ ముగింపు దశలో వందన సమర్పణ చేయాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అప్పగించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభకు సహకరించిన వారందరి పేర్లను ఉచ్చరించారు. లాస్టుకు తన కొడుకు పేరు కూడా పలికారు. కానీ స్థానిక ఎంపి బూర నర్సయ్య పేరును మాత్రం నోటినుంచి పలకలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక మిస్టెక్ లో జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.

కానీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కావాలనే బూర నర్సయ్యను అవమానించేలా ఆయన పేరు పలకలేదని బిసి సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. మంచిరెడ్డికి ఎంపి మీద కోపంతోనే ఇలా నిండు సభలో కనీస ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపిస్తున్నారు. తన కొడుకు పేరు చెప్పి, పక్క నియోజకవర్గం మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేరు చెప్పిన మంచిరెడ్డికి ప్రోటో కాల్ ప్రకారం ఎంపి బూరనర్సయ్య పేరు గుర్తుకు రాకుండా ఉంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బూర నర్సయ్యకు పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలని బిసి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండిచెరువు వెంకన్న విడుదల చేసిన పత్రికా ప్రకటన కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం.

బీసీలను చిన్న చూపు చూస్తున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి
ప్రగతి నివేదన సభ ఓట్ ఆఫ్ థాంక్స్ లో కనీసం స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరు కూడా ప్రస్తావించని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి తీగల కృష్ణ రెడ్డి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఇంకా అందరి పేర్లు చెప్పి చివరకు తన కొడుకు ప్రశాంత్ రెడ్డి (బంటి) పెరు సైతం ప్రస్తావించి స్థానిక ఎంపీ పేరు మాత్రం ప్రస్తావించని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈవిషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము.

తెలంగాణ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండిచెరువు వెంకన్న

బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలంటే చులకనగా చూస్తాడు ఈ కిషన్ రెడ్డి… మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ఇంత అహంకారమా మా ఓట్లతో గెలిచి మమ్ములనే తక్కువ చేస్తావా ఇకపై బీసీ లు గ ఎవరు కూడా మంచిరెడ్డి కి సహకరించ వద్దు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. 

ఇదే కాకుండా ఈమధ్య కాలంలో ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీద గా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా ఎమ్మెల్యే నే ద్వంసం చేయించి ఉంటారని మాకు అనుమానం కలుగుతున్నది. దీనిపై సిఎం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే బిసి వర్గాలు ఏకమై ఆందోళనబాట పట్టకతప్పదు.