చలో కొంగరకలాన్ కు కృష్ణ మాదిగ పిలుపు

 

తెలంగాణ టిఆర్ఎస్ సర్కారు, కేంద్రంలోని బిజెపి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. దళితులను మోసం చేసినందుకు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మాయమాటలు చెప్పి దగా చేసినందుకు, దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి ద్రోహం చేసినందుకు, దళిత నేత రాజయ్యను అవమానకరంగా బర్తరఫ్ చేసినందుకు నిరసనగా నవంబరు 6వ తేదీన కొంగరకలాన్ లోనే తెలంగాణ ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ మాదిగ మాట్లాడారు. ఆ వివరాలు చదవండి.

ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు చిత్త శుద్ధి లేదని విమర్శించారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. రెండు ప్రభుత్వాలు మాదిగ ఉద్యమాన్ని చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణకు రానున్న బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాదిగల సెగ లేకుండా ఢిల్లీ పోలేరు. జాన్ 6వ తేదీన భారతి చనిపోయింది. 25 లక్షల ఎక్సగ్రేషియా ఇప్పటివరకు ఇవ్వలేదు.. ఆమె కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్ అఖిలపక్షం ని ఢిల్లీ కి తీసుకెళతానని శాసన సభలో ప్రకటించారు. 10 నెలల కాలంలో కేసీఆర్ 4 సార్లు ఢిల్లీ కి వెళ్లి మోడీని కలిసి వచ్చారు. కానీ ఈ 10 నెలల్లో భారతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు, అఖిల పక్షము ఢిల్లీకి తీసుకెళ్లలేదు. ఇచ్చిన హామీలను అమలు చేస్తారన్న నమ్మకం పోయింది.

ఎమ్మార్పీఎస్ వాయిస్ అంటే మాదిగల గుండె చప్పుడు. ఉమ్మడి రాష్ట్ర లో మాదిగల గుండె చప్పుడు గా వ్యవరిస్తూ సామాజిక బాధ్యత ను కూడా మోసింది. కొంగర్ కలాన్ సభలో కేసిఆర్ నన్ను ఆశీర్వదించండి అన్నారు కానీ సామాజిక కోణంలో ఒక్క హామీ నెరవేర్చ లేదు. గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులుగా దళితులు వున్నారు. సమాజంలో మాలినాన్ని శుభ్రం చేస్తున్నవారిలో దళితులే సింహభాగం ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు పర్మినెంట్ చేయకపోతే దళితులు ఇంకా వెనుకబడి వుంటారు. 2004 లో మేనిఫెస్టోలో లెదరు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. చర్మ కార్మికులను ఆదుకుంటామన్నారు. కానీ ఇప్పటి వరకు లెదర్ ఇండ్రస్టీ పై కనీసం సమీక్ష చేయలేదు. డప్పు కళాకారులు చెప్పులు కుట్టేవారికి పెన్షన్ ఇస్తాం అని చెప్పారు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. మనది మిగులు బడ్జెట్ అని చెబుతున్న కేసీఆర్ ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు.

కేసీఆర్ రాజయ్య ను బర్తరఫ్ చేస్తే ఎమ్మెల్యేలు అంతా కలిసి దళిత మేయర్ ను అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించారు. మేయర్ ని తొలగించడం అంటేనే మాదిగ జాతిని అవమాన పర్చడం కదా అని కేసీఆర్ అని అడుగుతున్న. భూ పంపిణీ జరగలేదు. రాజకీయ వర్గంలో దళితులకు ప్రాధాన్యత లేదు. 16 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నా వారిలో ఒక్క ఎమ్మెల్యే మంత్రిగా పనికిరారా? కొంగర్ కలన్ లో కడియం శ్రీహరి దళిత ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. 99 శాతం మిషన్ భగీరథ జరిగింది అని చెప్పాడు కానీ దళితుల 3 ఎకరాల భూ పంపిణీ  అందరికి చేసాము అని మాట్లాడలేదు. ప్రజాధనం తో  ప్రాజెక్టు లు కడుతున్నారు అని చెబుతున్నారు. 52 లక్షల మంది భూములు లేని నిరుపేదలు వున్నారు. 40 లక్షల పేద దళిత కుటుంబాలకు  భూములు  ఇస్తే బాగుపడే వారు కదా? దళితుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి ఏటా దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని  చెప్పారు. కనీసం సగం కూడా ఖర్చు పెట్టలేదు. మా నిధులతో మాకు భూములు కొనుగోలు చేయడంలేదు. కాగ్ నివేదిక కూడా ఎస్సీ, ఎస్టీ నిధులు పక్క దోవ పట్టాయని  చెప్పింది.

రిజర్వేషన్లు అమలు చేయక పోవడం వలన 8 శాతం ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. దళితులను మోసం చేసినందుకు  కేసీఆర్ ని ఆశీర్వదించాలా అని అడుగుతున్నాను. మంత్రి వర్గం లో మహిళల కు స్థానము లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం మహిళలు కృషి చేసారు. కానీ మహిళలకు  పదవులు లేవు. తలపులు మూసి తెలంగాణ బిల్లును తీసుకొచ్చింది మహిళలే. తెలంగాణ కోసం పోరాడింది మహిళలే. కానీ మహిళలను అవమాన పరుస్తున్నరు. ప్రగతి నివేదన సభ కి మహిళలకు కూడా మందు తాపించారంటేనే టిఆర్ఎస్ ప్రభుత్వం దిగజరుతుంది అని అర్ధం అవుతుంది. తెలంగాణ కోసం  ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కేసీఆర్ పాలనలో మోసాలు వైఫల్యాలను పెట్టుకొని ప్రజలను ఎలా ఆశీర్వదించమంటవు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుంది. ధర్నా చౌక్ ఎత్తి వేశాడు.  ప్రశ్నించిన వారిపై అణచివేత సాగిస్తున్నారు. వైఫల్యాలను ఎండ గడుతున్న కోదండరాం ఇంటి పై దాడి చేయడం దారుణం. మిలియన్ మార్చ్ సందర్భంగా విధ్వంసం పేరుతో కేసీఆర్ కేటీఆర్ ఎ1 .ఎ2 గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ జైల్ కి పంపలేదు. వైఫల్యాలను ప్రశ్నిచినన వారిపై అణచి వేత సరికాదు. శాసన సభ  ఎన్నికలు ముందస్తు వచ్చినా కేసీఆర్ తగిన మూల్యం తప్పదు.

కొంగర్ కలాన్ సభ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెరిగాయి. సభ బాగా జరిగింది అని చెప్పుకుంటున్న కేసీఆర్ సభలో మంత్రులకు ముఖం మీద  రక్తం చుక్క లేకుండా పోయింది ఎందుకో చెప్పాలి. కొంగర్ కలాన్ సభకి అభివృద్ధి చూసి జనమొస్తే మందు, డబ్బు, విందు  ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉంది. మోసాలు, వైఫల్యాలను దళితులను అభివృద్ధి కి దూరం చేసినందుకు కొంగరు కలాన్  లొనే ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రజా ఆగ్రహం సభ నిర్వహిస్తాం. కేసీఆర్ లాగా మేము మందు డబ్బులు ఇవ్వము. ఈ సభకు బీజేపీ, టిఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలను పిలుస్తాను. సవాల్ చేస్తున్న కొంగర్ కలన్ లొనే సభ నిర్వః హిస్తాం. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్గీకరణ కోసం కృషి చేస్తానన్నారు. వెంకయ్యనాయుడు పై మాకు గౌరవం ఉంది. కానీ బీజేపీ పై నమ్మకం లేదు. అన్ని వర్గాల ప్రజలతో కొంగర్ కలాన్ లో ప్రజా ఆగ్రహ సభ పెడతాం.