ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ సభతోనే టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపించింది. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, మధు యాష్కీ గౌడ్, రేవంత రెడ్డి ప్రగతి సభ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దీంతో అధికార టిఆర్ఎస్ పర్టీ ఎదురుదాడికి దిగింది. టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చదవండి.
.ప్రగతి నివేదిక సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. కాంగ్రెస్ లో కొత్త బిచ్చగాడు రేవంత్, పాత బిచ్చగాడు మధు యాష్కీ, బొమ్మాళి డీకే అరుణ, గడ్డం బాబా ఉత్తమ్ మా సభ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేం సభలు పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడుపు మంట. మా సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్య కన్నా మొన్న రాహుల్ గాంధీ మీటింగ్ కు వచ్చిన వారి సంఖ్య తక్కువ.
కాంగ్రెస్ నేతలది సొల్లు పురాణం. కాంగ్రెస్ నేతలు మా సభ పై తిట్లు ఆపక పోతే కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు. చాలా మందికి డిపాజిట్లు రావు. టిఆర్ఎస్ ను విమర్శిస్తే సూర్యుడి పై ఉమ్మేసినట్టే. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కెసిఆర్ ఎక్కడా చెప్పలేదు. ఉత్తమ్ తెలంగాణ ఉద్యమం లో పదవీ త్యాగము చేయలేదు ..డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉత్తమ్ ఆనాడు పని చేశారు. అపుడు నిరుద్యోగులపై ప్రేమ చూపని ఉత్తమ్ కు ఇపుడు వారు గుర్తొస్తున్నారు.
కాంగ్రెస్ లో నేతలు దొంగల ముఠాలా ఏర్పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోనియా తానే తెలంగాణ ఇచ్చినా అని చెప్పినా కరీంనగర్ లో ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు టిఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ నేతలు పేపర్ పులులు ,టీవీ టైగర్లు. ఆందోళన, భయం, ఆవేదన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే కెసిఆర్ పై తిట్ల పురాణం. గాంధీ భవన్ గోబెల్స్ భవన్ గా మారింది.
తెలంగాణ లో డ్రామాలు ,ద్రోహాలకు కాంగ్రెస్ తెర లేపుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కోర్టు కు వెల్తూ కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంత అడ్డుపడ్డా కెసిఆర్ ప్రకటించినట్టుగా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ నేతలు విమర్శలు మానకపోతే వారి పార్టీ కథ కంచికి, కాశి కే తప్పదు.