కొడంగల్ లో రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ ఝలక్ ???

మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొండగల్ లో ఉన్న పరిస్థితి

కొడంగల్ లో టెన్షన్ వాతవరణం మరింత పెరిగింది. ఇటువైపు ఐదుగురు మంత్రులు కొడంగల్ బాట పట్టారు. అటువైపు తన భారీ బలగంతో కొడంగల్ లో రేవంత్ కూడా సై అంటున్నారు. దీంతో కొడంగల్ లో ఎప్పుడే జరుగుతుందా అన్న టెన్షన్ నెలకొంది. ఇక మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహ్మారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి లు రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల కాన్వాయ్ తో కొడంగల్ బయలుదేరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి కూడా కొడంగల్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసే యోచనలో కొడంగల్ పోలీసులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రేవంత్ నియోజకవర్గంలో ఆయనను గృహ నిర్బంధం చేసి మంత్రుల టూర్ కు ఏర్పాట్లు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. 

కొడంగల్ లో రేవంత్ నివాసం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. ఆయన ఇంటికి జిల్లా అడిషనల్ ఎస్పీ చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మోయినాబాద్, షాబాద్ మీదుగా భారీ ర్యాలీతో మంత్రులు కొడంగల్ బయలుదేరారు. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలు ర్యాలీలు తీస్తే ఉద్రిక్తత నెలకొనే ప్రమాదముందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని ర్యాలీగా కాకుండా స్థానిక ఎమ్మెల్యే హోదాలో బస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలంటూ పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి రేవంత్ ససేమిరా అంటున్నారు. అడిషనల్ ఎస్పీతో చర్చలు ముగిసిన తర్వాత రేవంత్ ను హౌస్ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

రేవంత్ నివాసం వద్ద పోలీసులు, కార్యకర్తల హడావిడి వీడియో కింద ఉంది చూడొచ్చు.