జగపతి బాబు, లయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గజాల. ఆ వెంటనే ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ చిత్రం తరువాత వెంటనే ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘కలుసుకోవాలని’.. ఆ తరువాత తరుణ్ హీరోగా వచ్చిన ‘అదృష్టం’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ తో మరోసారి ‘అల్లరి రాముడు’ చిత్రంలో కూడా నటించి మెప్పించింది.
ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో చాలా మంచి పేరు తెచ్చుకున్నది. తన అందంతో పాటు నటనలో కూడా ఎంతో ప్రతిభ చూపించిన గజాల ఆ తరువాత సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగు హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండరనీ కొత్త వారికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. పాతవారు తెరమరుగు కావడం తెలిసినదే. గజాల మాత్రం మినహాయింపు కాదు కదా..!
అయితే ఈమె సడెన్ గా టాలీవుడ్ కు దూరమైపోయింది. అసలు ఈమె ఎందుకు దూరమైపోయింది.. దాని వెనుక ఉన్న కారణం ఏంటి..? అని ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.
గతంలో ఆమె ఓ టాలీవుడ్ హీరోతో గజాల ప్రేమాయణం నడపడం.. అతన్నే పెళ్ళి చేసుకుందాం అనుకునే తరుణంలో అతను ఈమెకు హ్యాండివ్వడం జరిగిపోయిందట. దాంతో ఈమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని ప్రాణత్యాగానికి కూడా పాల్పడటం.. జరిగిందట.
అయితే తనను ఓ హీరో మోసం చేశాడని 2002వ సంవత్సరంలో జులై 22న హైదరాబాద్‌లోని ప్రశాంత్ కుటీర్ రెస్ట్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగడంతో ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుందని అందరికీ తెలుసు..దీనికి ముందు ఆమె యాక్షన్ హీరో అర్జున్‌కు ఫోన్ చేసి ఇక ఆమె అతనికి కనిపించనని చెప్పడంతో అతను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించడం జరిగిందని అప్పట్లో చెప్పుకున్నారు.
ఆ సమయానికి హీరో అర్జున్ అక్కడకి చేరి చొరవ చేసుకుని ఆమెను హాస్పిటల్ లో చేర్చడంతో ఆమె బ్రతికి బయట పడినట్టు తెలిసింది. ఇక తర్వాత ఇదంతా అయిపోయాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరమవ్వడం జరిగింది. కొన్నాళ్ళ తరువాత ఆమె టీవీ సీరియల్ నటుడు అయిన ఫైజల్ రాజా ఖాన్ ను వివాహం చేసుకుంది.
అప్పట్లో అర్జునే కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే వాదనలు కూడా వినిపించాయి. కానీ అర్జున్ మాత్రం వాటిని ఖండించారు. మానవతా దృక్పథంతోనే అతను అలా సాయం చేశాడని.. గజాలకు అతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అప్పుడు వివాదం సద్దుమణిగినట్టు మనందరికీ తెలిసిన విషయమే..