Nenu Ready Teaser: హవిష్, త్రినాధ రావు నక్కిన ‘నేను రెడీ’ టీజర్ రేపు ‘రాజాసాబ్’ ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్ రిలీజ్

Nenu Ready Teaser: ‘నువ్విలా’, ‘జీనియస్’, ‘రామ్ లీల’, ‘సెవెన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో జతకట్టారు. ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’, ‘ధమాకా’, ‘మజాకా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన త్రినాధ రావు నక్కిన ‘నేను రెడీ’ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా టీజర్‌కు సంబంధించి చిత్ర బృందం ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను రివిల్ చేసింది. రేపు (జనవరి 9వ తేదీ) రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. సంక్రాంతి బరిలో ఉన్న ఈ పెద్ద సినిమాతో పాటు టీజర్ విడుదల కావడం వల్ల మ్యాసీవ్ రీచ్ లభించనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.

టీజర్ పోస్టర్‌లో హవిష్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడు ఆయన లుక్‌కు ఇంటెలెక్ట్యువల్ టచ్‌తో పాటు ఫెరోషియస్ ఎడ్జ్‌ను యాడ్ చేస్తోంది.

దర్శకుడు త్రినాధ రావు నక్కిన, హవిష్‌ను చాలా యూనిక్ గా ప్రజెంట్ చేస్తున్నారు. ఇది హవిష్ గత చిత్రాల కంటే చాలా డిఫరెంట్ గా వుంటుంది.

చిత్ర నిర్మాణం వేగంగా జరుగుతుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. మెలొడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ విజువల్స్ అందిస్తున్నారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను విక్రాంత్ శ్రీనివాస్ అందించారు.

నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్

అనసూయ బెండుతీసిన సంధ్య రెడ్డి || Congress Sandhya Reddy Fires On Anasuya || Naga Babu || Shivaji |TR